iDreamPost
android-app
ios-app

OTT Horror Suspense Thriller: OTT లో ఈ బెస్ట్ హర్రర్ వెబ్ సిరీస్ అసలు మిస్ కాకండి.. ఊపిరి బిగపట్టాల్సిందే !

  • Published Jun 04, 2024 | 3:27 PM Updated Updated Jun 04, 2024 | 3:27 PM

OTT Movie Suggestion : వెబ్ సిరీస్ లు అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడాలంటే మాత్రం సినిమాలకంటే.. సిరీస్ లలోనే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion : వెబ్ సిరీస్ లు అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడాలంటే మాత్రం సినిమాలకంటే.. సిరీస్ లలోనే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మిస్ చేశారేమో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 04, 2024 | 3:27 PMUpdated Jun 04, 2024 | 3:27 PM
OTT Horror Suspense Thriller: OTT లో ఈ బెస్ట్ హర్రర్ వెబ్ సిరీస్ అసలు మిస్ కాకండి.. ఊపిరి బిగపట్టాల్సిందే !

సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ లను ఇష్టంగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే, వెబ్ సిరీస్ లు అన్నీ కూడా ఎపిసోడ్స్ రూపంలో ఉండడంతో.. ప్రతి ఎపిసోడ్ ఎదో ఒక సస్పెన్స్, ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. దీనితో ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ లను చూడడానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోను హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ఏపీరియెన్స్ చేయాలంటే మాత్రం సినిమాలకంటే సిరీస్ ఏ బెటర్ అని చెప్పి తీరాలి. ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఈ కోవకు చెందిందే. పైగా ఇది తెలుగు వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ ను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

హర్రర్ , సస్పెన్స్ వెబ్ సిరీస్ లు అది కూడా తెలుగు వారు తీసినవి అంటే కాస్త తక్కువగా చూస్తారు, కానీ తెలుగులో కూడా మంచి కంటెంట్ తోనే ఈ సిరీస్ లను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ లో అమృత అనే లేడీ ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఆమె తండ్రి కాళిదాస్‌ ఆర్కియాలజిస్ట్‌. అయితే ఓ రోజు పురావస్తు తవ్వకాల్లో దొరికిన విలువైన వస్తువులతో పారిపోయాడని వార్తలు వస్తాయి. దీనితో అతనిపై దేశద్రోహి అనే ముద్ర వేస్తుంది సమాజం. తన తండ్రి దేశ ద్రోహి కాదని.. నిజాయితీ పరుడని నిరూపించాలని అమృత డిసైడ్ అవుతుంది. తన తండ్రి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే.. ఆయన ఊరికి ఉత్తరాన కొండపై ఉన్న మ్యాన్షన్‌కు వెళ్లారని తెలుస్తుంది. ఈ విషయం పోలీసులకు చెప్తే.. ఆ మాన్షన్ కు వెళ్లిన పోలీసులు ఎవరు తిరిగి రాలేదని.. తన తండ్రి గురించి ఇక వెతకాల్సిన పని లేదని చెప్తారు. దీనితో స్వయంగా అమృత స్వయంగా అక్కడికి వెళ్లాలని అనుకుంటుంది.

 

ఇక అక్కడినుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆమె అక్కడకు వెళ్లే ముందు వాచ్ మెన్ అమృతకు కొన్ని విషయాలు చెప్తాడు. ఇక ఆమె ఆ మాన్షన్ హౌస్ లోకి వెళ్ళగానే.. అక్కడకు వెళ్లి చూడగానే.. ఆ మాన్షన్ హౌస్ లో అనేక గదుల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళందరి కథలు ఏమిటి ? అసలు ఆ బిల్డింగ్ లోకి వెళ్లిన వారంతా ఎందుకు తిరిగి రారు? ఆ మ్యాన్షన్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయా ! పెర్టిక్యూలర్ గా మాన్షన్ హౌస్ రూమ్ నంబర్ 24 ఏం జరిగింది ? ఆ రహస్యం అమృతా తెలుసుకుందా లేదా ! అమృత వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నాడా ! చివరకు ఏమైంది ! ఇవన్నీ తెలియాలంటే “మ్యాన్షన్‌ 24” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmarsbahisCasibomcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş