iDreamPost
android-app
ios-app

Court Room Drama In OTT: కోర్టు రూమ్ డ్రామాల్లో దీన్ని కొట్టే సినిమా లేదు! OTTలో బెస్ట్ మూవీ

  • Published May 30, 2024 | 7:26 PMUpdated May 30, 2024 | 7:26 PM

OTT Movie Suggestion- Court Room Drama In OTT: ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎప్పుడు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఏ. మరి మీరు మిస్ చేసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో అన్ని జోనర్స్ కు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్, ఏది చూడాలి అనే సజ్జెషన్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇక వీటిలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎప్పుడు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఏ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీలో అయినా కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు నిజ నిజాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ.. ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం అలా జరగదు. రొటీన్ కు భిన్నంగా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమాలో హీరో ఒక హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఆ హోటల్ లో ఒక ఘోరమైన హత్య జరుగుతుంది. దీనితో ఈ కేసును సాల్వ్ చేయడానికి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగుతారు. ఆ హత్య ఎవరు చేశారో తెలియదు. దీనితో వారు హీరోపైనే ఆ నేరం మోపేందుకు ప్రయత్నిస్తారు పోలీసులు. అతను నిరపరాధి అయినా కూడా ప్రతి ఒక్కటి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. హీరో తరపున పోరాడే వారిని కూడా అడ్డుకుంటారు. అతను ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు? అసలు కోర్టు రూమ్ నిజంగా ఎలా ఉంటుంది ? అతనికి సహాయం చేయడానికి వచ్చిన వారు ఎవరు ? న్యాయంగా ఉండాల్సిన పోలీసులే అతనిని ఈ హత్య కేసులో ఎందుకు ఇరికించాలని అనుకుంటారు ? చివరికి అతను నిర్దోషిగా బయటకు వస్తాడా లేదా ! ఇవన్నీ తెలియాలంటే “వ్యూహం” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

వ్యహం అంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా అనుకుంటే పొరపాటే.. ఇది 2020 లో వచ్చిన ఓ మంచి సస్పెన్స్ కోర్టు రూమ్ డ్రామా. ఈ సినిమా ప్రస్తుతం ఆహలో అందుబాటులో ఉంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. దానితో పాటు న్యాయం చేయాల్సిన పోలీసులే.. అన్యాయానికి పాల్పడడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి