iDreamPost
android-app
ios-app

దేవర మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Nov 04, 2024 | 1:41 PM Updated Updated Nov 04, 2024 | 1:41 PM

Devara OTT: దేవర సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. దీపావళికి కానీ నవంబర్ 2వ వారంలో కానీ రిలీజ్ చేస్తానన్న దేవర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఎప్పుడో చూసేద్దాం.

Devara OTT: దేవర సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. దీపావళికి కానీ నవంబర్ 2వ వారంలో కానీ రిలీజ్ చేస్తానన్న దేవర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఎప్పుడో చూసేద్దాం.

  • Published Nov 04, 2024 | 1:41 PMUpdated Nov 04, 2024 | 1:41 PM
దేవర మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ నటించిన దేవర థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు రిలీజ్ కు రెడీ గా ఉన్న ఏ సినిమా గురించి మాట్లాడాలన్నా కానీ.. ముందు దేవర ఊసే తీస్తున్నారు. భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. మొదట డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే దాదాపు ఇరవై రోజుల పాటు థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో తారక్ ఇమేజ్ ఇంకాస్త పెరిగింది. అటు దర్శకుడు .. నిర్మాతలు అందరూ కూడా ఈ సినిమా విషయంలో ఫుల్ శాటిస్ఫాక్షన్ తో ఉన్నారు. ఇక తారక్ అభిమానుల గురించైతే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మా అన్న హిట్ కొట్టాడు.. జక్కన్న మిత్ బ్రేక్ చేసాడు అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు. దాదాపు థియేటర్స్ లో దేవర మ్యానియా ముగిసినట్లే. ఇప్పుడు అలాంటి రికార్డ్స్ ను OTT లో క్రియేట్ చేయడానికి ఎంట్రీ ఇచ్చేస్తుంది దేవర.

ఎంత పెద్ద సినిమా అయినా సరే.. చివరికి OTT లోకి రావాల్సిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు దేవర కూడా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. దీనితో విడుదలైన నెల తర్వాత ఓటీటీ లోకి అడుగుపెడుతుంది. ఇక ఇక్కడ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడమే బ్యాలెన్స్. ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ కు ముందే.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. దాదాపు రూ.150 కోట్లకు నెట్ ఫ్లిక్స్ దేవర OTT రైట్స్ ను దక్కించుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను లాక్ చేశారు. దేవర సినిమా నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది. దాదాపు అందరూ దేవర సినిమాను థియేటర్ లో చూసే ఉంటారు. అయినా సరే ఓటీటీ కోసం ఇంకా అదే ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ , మాస్ యాక్షన్ కోసం ఎన్ని సార్లు చూసినా తక్కువే అని ఫీల్ అవుతుంటారు అభిమానులు.

థియేటర్ లో రిలీజ్ అవ్వకముందే దేవర ఎన్నో రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక ఆ తర్వాత థియేటర్స్ లో దుమ్ము దులిపేసింది. ఇప్పుడు ఓటీటీ లెక్కలు తేల్చడానికి వచ్చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సుమారు రూ.500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమా రెండు పార్ట్స్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 లో
దేవర, వర అనే రెండు డిఫ్ఫరెంట్ రోల్స్ లో తారక్ యాక్షన్ చించేశాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ భైరాగా మెప్పించాడు. వీరితో పాటు జాన్వీ కపూర్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇవన్నీ చెప్పడం కంటే కూడా సినిమాలోచూస్తేనే ఆ ఫీల్ ను ఎంజాయ్ చేయగలుగుతారు మూవీ లవర్స్. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను ఎవరైనా మిస్ అయితే కనుక.. నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş