iDreamPost
android-app
ios-app

అదిరిపోయే ట్విస్ట్ లతో ఉండే డిమోంటీ కాలనీ 2 మూవీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

  • Published Sep 02, 2024 | 1:50 PM Updated Updated Sep 02, 2024 | 1:50 PM

Demonte Colony 2 OTT Streaming Date: హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారన్న సంగతి తెలియనిది కాదు. ఇటు ఓటీటీ లోనే కాకుండా థియేటర్స్ లోను హర్రర్ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

Demonte Colony 2 OTT Streaming Date: హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారన్న సంగతి తెలియనిది కాదు. ఇటు ఓటీటీ లోనే కాకుండా థియేటర్స్ లోను హర్రర్ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Sep 02, 2024 | 1:50 PMUpdated Sep 02, 2024 | 1:50 PM
అదిరిపోయే ట్విస్ట్ లతో ఉండే డిమోంటీ కాలనీ 2 మూవీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

హర్రర్ సినిమాలంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అటు థియేటర్ లో కానీ ఇటు ఓటీటీ లో కానీ ఏదైనా హర్రర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉందంటే.. హర్రర్ మూవీ లవర్స్ వాటి కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాలు కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వణుకుపుట్టించే హర్రర్ మూవీ డిమోంటీ కాలనీ 2 .. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. తమిళంలో రిలీజ్ అయినా ఈ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో చూసేద్దాం.

2015 లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హర్రర్ మూవీ డిమోంటీ కాలనీ. అప్పటివరకు వచ్చిన హర్రర్ సినిమాలలోనే ఈ మూవీ ప్రతి ఒక్కరిని మెప్పించి బెస్ట్ హర్రర్ మూవీగా నిలించింది. ఇక ఇప్పుడు ఎలాగూ సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి.. ఇన్నేళ్లకు డిమోంటీ కాలనీ సినిమాకు సీక్వెల్ గా.. డిమోంటీ కాలనీ-2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు మేకర్స్. ఆగష్టు 15న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. థియేటర్స్ లో ఈ మూవీ తెలుగు వెర్షన్ కు కూడా మంచి క్రేజ్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగు భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామ్ రిచర్డ్ అనే వ్యక్తి క్యాన్సర్ బారిన పడి.. మృత్యువుతో పోరాడుతూ ఉంటాడు. అలాంటి స్టేజ్ లో ఉన్నా సరే.. అతనిని డెబి అనే అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అంత బాగానే ఉందనుకునే సమయానికి… ఉన్నట్లుండి సామ్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అసలు సామ్ సూసైడ్ కి కారణమేంటో తెలుసుకోవాలని.. ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. సామ్ ఒక పుస్తకం చదవడం వలెనే చనిపోయాడని ఆమె తెలుసుకుంటుంది. అలాగే ఆ పుస్తకం ఎవరు చదివినా కూడా చనిపోతారని తెలుస్తుంది. దీనితో ఆ వరుస హత్యలు ఆపాలని ఆమె ప్రయత్నిస్తుంది. అసలు ఆ బుక్ లో ఏముంది ? దానిని చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు ? దాని వెనుక ఉన్న కథేంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom