iDreamPost
android-app
ios-app

Demonte Colony 2 OTT: డీమాంటీ కాలనీ 2 OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Sep 10, 2024 | 11:02 AM Updated Updated Sep 10, 2024 | 1:44 PM

Demonte Colony 2 OTT Streaming Date: రీసెంట్ గా కోలీవుడ్ థియేటర్స్ లో సూపర్ సక్సెస్ సాధించిన హర్రర్ సినిమా డిమాంటీ కాలనీ 2.. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిపొయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Demonte Colony 2 OTT Streaming Date: రీసెంట్ గా కోలీవుడ్ థియేటర్స్ లో సూపర్ సక్సెస్ సాధించిన హర్రర్ సినిమా డిమాంటీ కాలనీ 2.. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిపొయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 10, 2024 | 11:02 AMUpdated Sep 10, 2024 | 1:44 PM
Demonte Colony 2 OTT: డీమాంటీ కాలనీ 2 OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే

మూవీ లవర్స్ లో హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎలాగూ ఓటీటీ లో హర్రర్ సినిమాలకు మంచి డిమాండ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు థియేటర్స్ లో కూడా హర్రర్ సినిమాలు.. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆల్రెడీ డిమాంటీ కాలనీ మూవీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాకు సిక్వెల్ గా వచ్చిన సినిమానే డిమాంటి కాలనీ 2..
ఈ క్రమంలో రీసెంట్ గా కోలీవుడ్ థియేటర్స్ లో సూపర్ సక్సెస్ సాధించింది ఈ మూవీ. తమిళ సినిమా అయినా సరే.. తెలుగులో కూడా ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని.. ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు.. ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆగస్ట్ 15 న తమిళంలో రిలీజ్ అయినా ఈ సినిమాను.. తెలుగులో ఆగష్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాతోనే అజయ్‌ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాగా ఈ చిత్రంలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీని సెప్టెంబర్ 27 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామ్ రిచర్డ్ అనే వ్యక్తి క్యాన్సర్ బారిన పడతాడు. మృత్యువుతో పోరాడుతున్న అతనిని.. డెబి అనే అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే క్యాన్సర్ అతనిని చంపే కంటే ముందే.. అతనే ఊహించని విధంగా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. దీనితో అసలు అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో తెలుసుకోవాలని డెబి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. సామ్ ఒక పుస్తకం చదవడం వలనే చనిపోయాడని తెలుసుకుంటుంది. అంతే కాదు ఆ పుస్తకం ఎవరు చదివినా కూడా చనిపోతారనే విషయం బయటపడుతుంది. దీనితో ఆ పుస్తకం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ బుక్ లో ఏముంది ? దానిని చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు ? దాని వెనుక ఉన్న కథేంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş