iDreamPost
android-app
ios-app

డెడ్‌పూల్&వాల్వెరైన్ OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 29, 2024 | 3:40 PM Updated Updated Jul 29, 2024 | 3:40 PM

Deadpool & Wolverine OTT: మార్వెల్ సిరీస్ ను అభిమానించే ప్రేక్షకులు.. చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో అమెరికన్ సూపర్ హీరోల నేపథ్యంలో.. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తున్న మూవీ డెడ్ పూల్& వాల్వరిన్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు కూడా వచ్చేశాయి.

Deadpool & Wolverine OTT: మార్వెల్ సిరీస్ ను అభిమానించే ప్రేక్షకులు.. చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో అమెరికన్ సూపర్ హీరోల నేపథ్యంలో.. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తున్న మూవీ డెడ్ పూల్& వాల్వరిన్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు కూడా వచ్చేశాయి.

  • Published Jul 29, 2024 | 3:40 PMUpdated Jul 29, 2024 | 3:40 PM
డెడ్‌పూల్&వాల్వెరైన్  OTT స్ట్రీమింగ్ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇప్పుడు చాలా వరకు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా.. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలు ఆయా సినిమాలను కొనుగోలు చేయడంలో చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి. ఇలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికన్ సూపర్ హీరోల నేపథ్యంలో.. రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయ్యి కాసుల వర్షం కురిపిస్తున్న మూవీ డెడ్ పూల్& వాల్వరిన్. ప్రస్తుతానికి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీటెయిల్స్ వచ్చేశాయి. ఆ వివరాలు చూసేద్దాం.

మార్వెల్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా.. అభిమానులకు ప్రత్యేకమే. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా దేనికి అదే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా.. మార్వె ల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్ 21 లాప్స్ ఎంటర్టైన్మెంట్.. నిర్మించిన డెడ్ పూల్& వాల్వరిన్ మూవీ జూలై 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక మూవీ రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో.. రిలీజ్ తర్వాత కూడా అదే హిట్ టాక్ తో థియేటర్స్ ను దున్నేస్తుంది. ఈ సినిమా అంత త్వరగా అయితే ఓటీటీ లోకి వచ్చే అవకాశం లేదు కానీ.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను మాత్రం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

DeadPool

ఇక డెడ్‌పూల్&వాల్వెరైన్ మూవీ కథ విషయానికొస్తే.. వేడ్‌ విల్సన్‌, అకా డెడ్‌పూర్‌ ఇద్దరూ సెకండ్ హ్యాండ్ కార్స్ ను సేల్స్ చేస్తూ.. నార్మల్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవ్వడంతో.. డెడ్ పూల్ డ్రస్ ను తీసేసి.. కార్ సేల్స్ మ్యాన్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక మరో వైపు… తన పుట్టిన రోజు సంధర్బంగా టైమ్ వేరియన్స్ అథారిటీని నిర్వహించే పారడాక్స్ మనుషులు.. అతనిని ఎర్త్ 616 జాయిన్ అవ్వమంటారు. ఈ క్రమంలో పారడాక్స్ నుంచి టైమ్ ప్యాడ్ ను దొంగలించి.. మల్టి వేర్స్ కు వెళ్ళి లోగన్ వేరియెంట్ ను సేవ్ చేయాలనీ అతను ప్రయత్నిస్తాడు. లోగన్ తో కలిసి వేడ్ విల్సన్ ఏం చేశాడు ? మల్టీవెర్స్ లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు ? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet