iDreamPost
android-app
ios-app

OTT లోకి డెడ్‌పూల్&వాల్వెరైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

  • Published Sep 18, 2024 | 6:46 PM Updated Updated Sep 18, 2024 | 6:46 PM

Deadpool Wolverine Movie OTT Streaming Date: టాలీవుడ్ హాలీవుడ్ అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరించే తీరు మారుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపిన చిత్రం డెడ్‌పూల్&వాల్వెరైన్. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

Deadpool Wolverine Movie OTT Streaming Date: టాలీవుడ్ హాలీవుడ్ అని తేడా లేకుండా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరించే తీరు మారుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపిన చిత్రం డెడ్‌పూల్&వాల్వెరైన్. ఇక ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది.

  • Published Sep 18, 2024 | 6:46 PMUpdated Sep 18, 2024 | 6:46 PM
OTT లోకి డెడ్‌పూల్&వాల్వెరైన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

థియేటర్ లో సినిమాలను చూసినా కానీ.. ఓటీటీ లో ఆయా సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాలకు కొదవే లేదు. ఇలా థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో.. నెలలోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా హాలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ అని తేడా లేకుండా.. కంటెంట్ ను బట్టి ఆయా సినిమాలను ఆదరించే తీరు మారుతుంది. ఈ క్రమంలో రీసెంట్ గా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపిన మూవీ డెడ్‌పూల్&వాల్వెరైన్. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కైతే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

అమెరికన్ సూపర్ హీరోల నేపథ్యంలో కాసుల వర్షం కురిపించిన మూవీ డెడ్ పూల్& వాల్వరిన్. మార్వెల్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా.. అభిమానులకు ప్రత్యేకమే. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. ఈ మూవీ ఒకెత్తు. జూలై 26న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందట. కాగా అక్టోబర్ 1 నుంచి మొదట ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక అక్టోబర్ చివరి వారంలో అన్ని భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్.

ఇక డెడ్‌పూల్&వాల్వెరైన్ మూవీ కథ విషయానికొస్తే.. వేడ్‌ విల్సన్‌, అకా డెడ్‌పూర్‌ ఇద్దరూ సెకండ్ హ్యాండ్ కార్స్ ను సేల్స్ చేస్తూ.. నార్మల్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు. అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవ్వడంతో.. డెడ్ పూల్ డ్రస్ ను తీసేసి.. కార్ సేల్స్ మ్యాన్ గా పని చేస్తూ ఉంటాడు. ఇక మరో వైపు తన పుట్టిన రోజు సంధర్బంగా టైమ్ వేరియన్స్ అథారిటీని నిర్వహించే పారడాక్స్ మనుషులు.. అతనిని ఎర్త్ 616 జాయిన్ అవ్వమంటారు. ఈ క్రమంలో పారడాక్స్ నుంచి టైమ్ ప్యాడ్ ను దొంగలించి.. మల్టి వేర్స్ కు వెళ్ళి లోగన్ వేరియెంట్ ను సేవ్ చేయాలనీ అతను ప్రయత్నిస్తాడు. లోగన్ తో కలిసి వేడ్ విల్సన్ ఏం చేశాడు ? మల్టీవెర్స్ లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు ? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ మూవీ ఓటీటీ లో ఎంతమందిని మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet