iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : డార్లింగ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Aug 02, 2024 | 1:14 PM Updated Updated Aug 02, 2024 | 1:14 PM

Darling Movie OTT Streaming Date: ఈ వీకెండ్ చిల్ అవ్వడానికి ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు , సిరీస్ లు వచ్చాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

Darling Movie OTT Streaming Date: ఈ వీకెండ్ చిల్ అవ్వడానికి ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు , సిరీస్ లు వచ్చాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Aug 02, 2024 | 1:14 PMUpdated Aug 02, 2024 | 1:14 PM
అఫీషియల్ : డార్లింగ్ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా కానీ.. అవి ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం హిట్ టాక్ నే సంపాదించుకుంటున్నాయి. ఇక ఆయా సినిమాలను థియేటర్స్ లో చూడడం మిస్ అయినా ప్రేక్షకులు.. ఓటీటీ లోకి ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలలో ఒకటి.. నభ నటేష్ , ప్రియ దర్శి కలిసి నటించిన “డార్లింగ్” మూవీ. జూలై 19 న థియేటర్ లో రిలీజ్ ఈ మూవీ.. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

డార్లింగ్ సినిమాకు డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో.. రిలీజ్ తర్వాత కూడా అదే డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. మూవీ థియేటర్ లో రిలీజ్ కాకముందే థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ భారీ ధరలకు అమ్ముడు పోయింది. ఇక రిలీజ్ తర్వాత కలెక్షన్స్ విషయంలోనూ అదే జోరును కొనసాగించింది డార్లింగ్ మూవీ. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. ఆగష్టు 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు .. అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ చేసిన వారు వెంటనే ఓటీటీ లో చూసేయండి.

ఇక డార్లింగ్ మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియదర్శికి చిన్నప్పటినుంచి కూడా బాగా చదువుకుని.. మంచి ఉద్యోగం సంపాదించి.. ఓ అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని పారిస్ వెళ్లాలనే కోరిక ఉంటుంది. అనుకున్న విధంగానే అతని పెరిగి పెద్దయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయితో పెళ్ళి నిశ్చయం అవుతుంది. కానీ కొన్ని కారణాల వలన పీటల మీద పెళ్ళి ఆగిపోతుంది. దీనితో అతను సూసైడ్ చేసుకోడానికి ట్రై చేస్తాడు. కానీ సరిగ్గా అదే సమయంలో నభా నటేష్ తో పరిచయం అవ్వడం వలన అతని ఆలోచనలు మారిపోతాయి. నభ నటేష్ రాక వలన ప్రియ దర్శి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobetjojobet giriş