iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన ‘డార్లింగ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 13, 2024 | 11:10 AM Updated Updated Aug 13, 2024 | 5:18 PM

Darling Movie OTT Streaming : ఈ వీకెండ్ ఓటీటీ లో ఎంటర్టైన్మెంట్ కాస్త ముందే స్టార్ట్ అయింది. అసలే ఇండిపెండెన్స్ డే.. లాంగ్ వీకెండ్ సో.. మూవీ లవర్స్ అంతా ఎన్ని సినిమాలను వీలైతే అన్ని సినిమాలను చూడడానికి రెడీ అయిపోతూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఈ వారం ముందుగా ఓటీటీ లోకి వచ్చేసిన సినిమా ఏంటో చూసేద్దాం.

Darling Movie OTT Streaming : ఈ వీకెండ్ ఓటీటీ లో ఎంటర్టైన్మెంట్ కాస్త ముందే స్టార్ట్ అయింది. అసలే ఇండిపెండెన్స్ డే.. లాంగ్ వీకెండ్ సో.. మూవీ లవర్స్ అంతా ఎన్ని సినిమాలను వీలైతే అన్ని సినిమాలను చూడడానికి రెడీ అయిపోతూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఈ వారం ముందుగా ఓటీటీ లోకి వచ్చేసిన సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Aug 13, 2024 | 11:10 AMUpdated Aug 13, 2024 | 5:18 PM
OTT లోకి వచ్చేసిన ‘డార్లింగ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ప్రతి వీకెండ్ కంటే కూడా ఈ వీకెండ్ మూవీ లవర్స్ కు కాస్త స్పెషల్ ఎందుకంటే.. ఇండిపెండెన్స్ డే రావడంతో.. ఈసారి లాంగ్ వీకెండ్ వచ్చింది కాబాట్టి. ఇది దృష్టిలో ఉంచుకుని మూవీ మేకర్స్ కూడా మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి.. అటు థియేటర్ లో కూడా మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ను దించుతున్నారు. ఇక థియేటర్ సినిమాలే కాకుండా ఇటు ఓటీటీ లో కూడా ఈ వీకెండ్ పక్కా ఎంటర్టైన్ చేయడానికి చాలా తెలుగు సినిమాలు రెడీ గా ఉన్నాయి. ఇక ఈసారి వీకెండ్ కాస్త ముందే స్టార్ట్ అయింది.ఈ వారం ముందుగా ఓటీటీ లోకి వచ్చేసిన సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. నభా నటేష్ , ప్రియ దర్శి జంటగా నటించిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు బాగానే పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంది. పైగా థియేట్రికల్ రిలీజ్ కాకుండానే ఈ మూవీ.. ఓటీటీ డీల్ వలన లాభాల బాట పట్టింది. ఇక డీసెంట్ హైప్ మధ్యన ఈ సినిమా జూలై 19న థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అటు కలెక్షన్స్ విషయంలోనూ అంతంత మాత్రంగానే అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. ఆగష్టు 13 నుంచి మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పుడు థియేటర్ లో హిట్ కానీ మూవీస్ అన్నీ కూడా.. ఓటీటీ ప్రేక్షకులను ఇట్టే మెప్పించేస్తున్నాయి కాబట్టి.. ఈ సినిమా కూడా మంచి వ్యూస్ సంపాదించుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. వెంటనే ఓటీటీ లో ఈ మూవీ చూసేయండి.

ఇక ‘డార్లింగ్’ మూవీ కథ విషయానికొస్తే.. ఇదొక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్.. చిన్నపటినుంచి కూడా ప్రియదర్శికి ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆమెను పారిస్ తీసుకు వెళ్లాలని డ్రీం ఉండేది. అతనితో పాటు అతని కోరిక కూడా రోజు రోజుకి బలంగా మారుతూ వచ్చింది. తన డ్రీం ను నెరవేర్చుకోవడం కోసం అతను ఓ సంపాదించుకుని.. ఓ అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చయించుకుంటాడు. అంతా బాగానే సాగిపోతుంది అనుకునే సమయానికి.. పీటల మీద పెళ్ళి ఆగిపోతుంది. దీనితో ఆ బాధను తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. కానీ సరిగ్గా అదే సమయానికి అతనికి జీవితంలోకి.. నభ ఎంటర్ అవుతుంది. ఇక అప్పటినుంచి అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అతను కన్న కల నెరవేరిందా లేదా ? తర్వాత ఏం జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ వీకెండ్ ఓ మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom