iDreamPost
android-app
ios-app

OTTలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన శశి మదనం.. అధికారిక ప్రకటన.. ఎప్పటి నుంచంటే

  • Published Jul 02, 2024 | 9:52 AM Updated Updated Jul 02, 2024 | 9:52 AM

Sasi Madhanam: రొమాంటిక్‌, కామెడీ వెబ్‌ సిరీస్‌ శశి మదనం.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాలు..

Sasi Madhanam: రొమాంటిక్‌, కామెడీ వెబ్‌ సిరీస్‌ శశి మదనం.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 02, 2024 | 9:52 AMUpdated Jul 02, 2024 | 9:52 AM
OTTలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిన శశి మదనం.. అధికారిక ప్రకటన.. ఎప్పటి నుంచంటే

ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. కల్కి లాంటి పెద్ద సినిమాలు.. లేదంటే ఏదైనా మూవీకి మంచి మౌత్‌ టాక్‌ వస్తే తప్ప జనాలు థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏదైనా మూవీ రిలీజ్‌ అయితే.. ఎలాను నె రోజుల్లో ఆ సినిమా ఓటీటీల్లోకి వస్తుంది కదా.. అప్పుడు తీరిగ్గా ఎంజాయ్‌ చేస్తున్నారు. కేవలం ఒక్క భాషకు సంబంధించిన సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాక.. వేరే భాషల్లో విడుదలై మంచి విజయం సాధించిన సినిమాలు, సిరీస్‌లు అందుబాటులో ఉంటడంతో.. చాలా మంది ఓటీటీ వీక్షణానికే ఓటు వేస్తున్నారు. ఇక నేటి కాలంలో వీటి హవా ఎంతలా పెరిగిందంటే.. టాప్‌ నటీనటులు సైతం ఇప్పుడు ఓటీటీల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక ఈమధ్య కాలంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి

పైగా ఓటీటీల్లో అన్ని జానర్‌లు అనగా.. సస్పెన్స్, థ్రిల్లర్, హర్రర్, కామెడీ తేడా లేకుండా అన్ని జానర్ల సినిమాలు అందుబాటులో ఉండటం మూవీ లవర్స్‌ను ఆకర్షిస్తుంది. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్‌ జానర్‌ సినిమాలకు క్రేజ్‌ ఎప్పటికి అలానే ఉంటుంది. పైగా ఈ సినిమాలు ఎక్కువ శాతం విజయం సాధిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా తెలుగు నుండి ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది. శశిమదనం పేరుతో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాలు..

జూలై 4 నుంచి శశి మదనం వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. బుల్లితెరపై తనదైన పంచులతో క్రేజ్‌ పెంచుకున్న సోనియా సింగ్ ఈ రొమాంటిక్ కామెడీ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించింది. ఆమెతోపాటు పవన్ సిద్ధూ, రూప లక్ష్మి, కీర్తి లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సిరీస్‌.. ఈటీవీ విన్‌లో జులై 4 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. కేవలం టీజర్ చూస్తే చాలు.. వెబ్ సిరీస్‌లో కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. టీజర్ ఆధ్యాంతం మొత్తం నవ్వులు పూయించింది. ” దాగుడుమూతలు దండాకోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్చుప్” అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ గురించి తెలిపారు మూవీ మేకర్స్. జూలై 4 అనగా గురువారం నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommarsbahisMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/