Swetha
రెగ్యులర్ మూవీస్ సిరీస్ కాకుండా ఈ వీకెండ్ ఓ మంచి మర్డర్ మిస్టరీ చూడాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మర్డర్ మిస్టరీస్ ప్లాట్ ఒకటే అయినా కూడా.. ఆ మిస్టరీస్ ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కో దానిలో ఒక్కో రకమైన ట్విస్ట్ లు బయటపడుతూ ఉంటాయి. ఈ సిరీస్ కూడా అలాంటిదే ఓ మర్డర్ ఆ మర్డర్ కు సంబంధించి 9 మంది అనుమానితులు.
రెగ్యులర్ మూవీస్ సిరీస్ కాకుండా ఈ వీకెండ్ ఓ మంచి మర్డర్ మిస్టరీ చూడాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మర్డర్ మిస్టరీస్ ప్లాట్ ఒకటే అయినా కూడా.. ఆ మిస్టరీస్ ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కో దానిలో ఒక్కో రకమైన ట్విస్ట్ లు బయటపడుతూ ఉంటాయి. ఈ సిరీస్ కూడా అలాంటిదే ఓ మర్డర్ ఆ మర్డర్ కు సంబంధించి 9 మంది అనుమానితులు.
Swetha
రెగ్యులర్ మూవీస్ సిరీస్ కాకుండా ఈ వీకెండ్ ఓ మంచి మర్డర్ మిస్టరీ చూడాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. మర్డర్ మిస్టరీస్ ప్లాట్ ఒకటే అయినా కూడా.. ఆ మిస్టరీస్ ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కో దానిలో ఒక్కో రకమైన ట్విస్ట్ లు బయటపడుతూ ఉంటాయి. ఈ సిరీస్ కూడా అలాంటిదే ఓ మర్డర్ ఆ మర్డర్ కు సంబంధించి 9 మంది అనుమానితులు. దీని చుట్టూనే ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.అసలు స్టోరీ ఏంటి ఇవన్నీ చూసేద్దాం.
ఈ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. ఇది మధ్యప్రదేశ్ లోని బురాన్ పూర్ లో జరిగే కథ. అలీషా , షాలు, ఇరా , మెహక్ అనే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ సిరీస్ కథ కొనసాగుతూ ఉంటుంది. కథ మొదలైన వేనంటే షాలు అనే క్యారెక్టర్ ను చనిపోయినట్లుగా చూపిస్తారు. అలీషా పెళ్లి కోసం వచ్చిన ఆమె ఎవరికీ అంతుచిక్కని విధంగా నీటిలో మునిగి చనిపోతుంది. అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన SP దేవిక ఈ కేస్ ను టేక్ ఓవర్ చేస్తుంది. షాలు చనిపోయిన సమయంలో ఆ ఇంట్లో 9 మంది ఉంటారు. దీనితో ఆ 9 మందిని అనుమానితులుగా గుర్తిస్తుంది. ఈ లిస్ట్ లో ఆమె స్నేహితులతోపాటు ఇంట్లో వాళ్లు, ఆమె మేనేజర్, మెహక్ భర్త, మంత్రి కొడుకు అయిన విక్రమ్ చండేల్ కూడా ఉంటారు. మరి వీరిలో అసలు షాలుని హత్య చేసింది ఎవరు ? ఆమె ఎలా చనిపోతుంది ? దేవిక ఆ మిస్టరీని సాల్వ్ చేస్తుందా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ పేరు ఛల్ కపట్. ఇసి ఒక హిందీ సిరీస్. ఈ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కాస్త గందరగోళంగా అనిపిస్తూ ఉన్నా సరే.. మొదటి నుంచి చివరి వరకు చాలా సస్పెన్స్ గా కొనసాగుతూ ఉంటుంది. ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్ ప్రస్తుతం జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం హిందీ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇలాంటి క్యూరియాసిటీతో ఉండే సినిమాలకు, సిరీస్ లకు లాంగ్వేజ్స్ తో సంబంధం లేదు కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.