iDreamPost
android-app
ios-app

బడ్డీ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

  • Published Aug 03, 2024 | 1:39 PM Updated Updated Aug 03, 2024 | 1:39 PM

Buddy Movie OTT Partner: ఇలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ' మూవీ ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.

Buddy Movie OTT Partner: ఇలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ' మూవీ ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం.

  • Published Aug 03, 2024 | 1:39 PMUpdated Aug 03, 2024 | 1:39 PM
బడ్డీ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

ఎలాగూ థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎంత స్పీడ్ గా ఉన్నాయంటే.. ఇలా సినిమాలో థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోతున్నాయి. ఇక నెల లోపే ఆయా సినిమాల థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ వారం థియేటర్స్ లో నాలుగు సినిమాలు రిలీజ్ కాగా.. వాటిలో అల్లు శిరీష్ నటించిన బడ్డీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేశాయి. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో చూసేద్దాం.

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో అల్లు శిరీష్ కూడా ఒకరు. ఈ హీరో తీసింది తక్కువ సినిమాలే అయినా కానీ ప్రేక్షకులలో మంచి టాక్ నే సంపాదించుకున్నాడు. సరైన స్క్రిప్ట్స్ లేక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శిరీష్. లేటెస్ట్ గా ఓ కొత్త కాన్సెప్ట్ మూవీ ‘బడ్డీ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆగష్టు 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రిలీజ్ కు ముందు టికెట్ ధరలు తగ్గించడంతో.. సోషల్ మీడియాలో ఈ మూవీ పై బాగానే బజ్ వినిపించింది. ఇక ఇప్పుడు కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్ తోనే కొనసాగుతుంది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ డీల్ ను కూడా క్లోజ్ చేసుకుంది. బడ్డీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఈ మధ్య చాలా తక్కువ సినిమాల విషయంలో ఇది జరుగుతుంది. చూడబోతుంటే బడ్డీ మూవీ కూడా నెల లోపే ఓటీటీ ఎంట్రీ ఇస్తుందేమో అనిపిస్తుంది. లాంగ్ రన్ లో థియేటర్ లో ఈ మూవీ కొనసాగే దానిని బట్టి.. స్ట్రీమింగ్ డేట్ బేస్ అయ్యి ఉంటుంది. ఇక బడ్డీ సినిమాకు శామ్ ఆన్టన్ దర్శకత్వం వహించగా.. అల్లు శిరీష్, అజీమ్ అమీర్, గాయత్రి భరద్వాజ్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన ఈ మూవీ ప్రస్తుతానికి థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తోనే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి . మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.