iDreamPost
android-app
ios-app

నెలలోపే OTT స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ‘బడ్డీ’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

  • Published Aug 19, 2024 | 5:45 AM Updated Updated Aug 19, 2024 | 6:59 AM

Buddy Movie OTT Streaming : అల్లు శిరీష్ నటించిన బడ్డీ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి.. నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Buddy Movie OTT Streaming : అల్లు శిరీష్ నటించిన బడ్డీ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి.. నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 19, 2024 | 5:45 AMUpdated Aug 19, 2024 | 6:59 AM
నెలలోపే OTT స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ‘బడ్డీ’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

థియేటర్ లో ఎలాంటి టాక్ సంపాదించుకున్నా కానీ.. కొన్ని సినిమాలు ఓటీటీ లో మాత్రం హిట్ టాక్ నే సంపాదించుకుంటున్నాయి. పైగా ఈ మధ్య అయితే థియేటర్ లో డిజాస్టర్ అయినా కానీ ఓటీటీ లో మాత్రం ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇక కొన్ని సినిమాలైతే నెల లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఓటీటీ లోకి వచ్చిన తర్వాత హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 2న థియేటర్ లో రిలీజ్ అయినా అల్లు శిరీష్ బడ్డీ సినిమా..నెల తిరగకముందే ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది.. అనే విషయాలను గురించి చూసేయండి.

బడ్డీ సినిమాకు శామ్ ఆన్టన్ దర్శకత్వం వహించగా.. అల్లు శిరీష్, అజీమ్ అమీర్, గాయత్రి భరద్వాజ్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన ఈ మూవీ ప్రస్తుతానికి థియేటర్స్ లో మొదట పాజిటివ్ టాక్ తోనే కొనసాగింది. కానీ లాంగ్ రన్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా థియేటర్ లో కొత్త సినిమాలు రావడంతో.. ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఈ సినిమాను ఆగష్టు చివరి వారంలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. దాదాపు ఈ నెలాఖరుకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కన్ఫర్మ్ అయినట్లే.

ఇక బడ్డీ మూవీ కథ విషయానికొస్తే.. అల్లు శిరీష్ ఒక పైలెట్ , గాయత్రీ భరద్వాజ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లో జాబ్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒక సంఘటన వలన వీరిద్దరూ కాల్స్ లో పరిచయం అవుతారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో ఓ రోజు గాయత్రీ చేసిన తప్పు వలన.. శిరీష్ సస్పెండ్ అవుతాడు. దీనితో ఆమె ఎలాగైనా అతనికి క్షమాపణ చెప్పాలని అనుకుంటుంది. కానీ ఈలోపే ఆమెకు యాక్సిండెంట్ అవ్వడం.. కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ఇంతలో ఆమె ఆత్మ ఒక టెడ్డీ బేర్ బొమ్మలోకి వెళ్తుంది. అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. బొమ్మలోకి ఆమె ఆత్మ ఎలా వెళ్తుంది ? అవయవాల అక్రమ రవాణా గురించి ఏం చూపించారు ? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş