iDreamPost
android-app
ios-app

OTTలోకి రానున్న భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ

  • Published Mar 16, 2024 | 10:54 AM Updated Updated Mar 16, 2024 | 10:54 AM

శివ కందకూరి హీరోగా నటించిన లెటెస్ట్ ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..

శివ కందకూరి హీరోగా నటించిన లెటెస్ట్ ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Mar 16, 2024 | 10:54 AMUpdated Mar 16, 2024 | 10:54 AM
OTTలోకి రానున్న భూతద్దం భాస్కర్ నారాయణ  మూవీ

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు మంచి కంటెంట్ తో వచ్చిన సినిమా చిన్నదైనా సరే బాగా ఆదరిస్తున్నారు. అయితే వీటిలో ఎక్కువగా కామెడీ, సష్పెన్స్ థ్రిల్లర్ హారర్ జోనర్ లకు సంబంధించిన సినిమాలైతే స్పెషల్ గా చెప్పాలసిన పని లేదు. ఎందుకంటే.. ఆ జోనర్ లో విడుదలైన ఏ సినిమానైనా ప్రేక్షకులు క్షణం ఆలస్యం చేయకుండా.. సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్లలకు పరుగులు పెడతారు. ఇక థియేటర్లలో ప్రేక్షకులన కట్టిపడేసిన ఆ సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఓటీటీ లవర్స్ కూడా తెగ ఎదురు చూసేస్తారు. మరి, అలాంటి ఇంట్రస్టీంగ్ థ్రిల్లర్ సినిమాలో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ సినిమా కూడా ఒకటి. ఈ వైవిద్యమైన సష్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివకందుకూరి హీరోగా నటించాడు. కాగా, ఈ సినిమా టీజర్ విడుదలవ్వడంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పడంటే..

శివ కందకూరి హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఈ సినిమా ఫ్యాంటసీ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా దర్శకుడు పురుషోత్తమ్ రాజ్ తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం ఈనెల అనగా మార్చి 1వ తేదీన విడుదలైంది. ఇక ఈ డిటెక్టివ్ బ్యాక్ డ్రాప్ లో విడుదలైన ఏ సినిమా అయిన మంచి హిట్ కొట్టాల్సిందే. ఇప్పటికే ఈ తరహా సినిమాలు విడుదలై మంచి హిట్ టాక్ అందుకున్న విషయం తెలిసింది. అయితే ఇప్పుడు భూతద్దం భాస్కర్ నారయణ సినిమా కూడా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఓ మోస్తరుగా వసూళ్లను కూడా రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Bhoothaddam Bhaskar Narayana in ott

కాగా, ఈ సినిమాను ఆహా ఓటీటీ హక్కులకు సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఆహాలో ఈనెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం అందింది. మరి దాదాపుగా ఆ తేదీ ఖాయమైనట్టు టాక్ వినిపిస్తున్న.. దీనిపై ఇంక అధికారిక ప్రకటన రానుంది. అయితే, భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో శివ కందుకూరి ప్రధాన పాత్ర పోషించగా..అందులో రాశి సింగ్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి స్నేహల్ జంగల, శశిధర్ కాశీ, కార్తిక్ ముడుంబి సంయుక్తంగా నిర్మించగా.. చవిజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు.

ఇక భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా కథ విషయానికొస్తే.. మర్డర్ మిస్టరీని ఓ డిటెక్టివ్ ఛేదించడం.. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్ల చుట్టూ ఈ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా తిరుగుతుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఓ సీరియల్ కిల్లర్ వరుసగా మహిళలను హత్య చేస్తుంటాడు. ఆ శవాలను అడవిలో పడేసి తలలను మాత్రం తన వెంట తీసుకెళతాడు. అయితే, ఈ హత్యకు గురైన వ్యక్తుల గురించి మిస్సింగ్ కేసులు నమోదు కాకపోవడం, శవాలకు తలలు లేకపోవడంతో ఈ మర్డర్ కేసులను దర్యాప్తు చేయడం పోలీసులకు సవాలుగా మారుతుంది. ఈ క్రమంలోనే డిటెక్టివ్ భూతద్దం భాస్కర్ నారాయణ (శివ కందూకూరి) ఈ హత్య కేసుల మిస్టరీని ఛేదించేందుకు రెడీ అవుతాడు. ఈ వరుస హత్య విషయంలో అతడికి వ్యక్తిగతంగానూ కనెక్ష్ ఉంటుంది. దీంతో సీరియస్‍గా దర్యాప్తు చేస్తాడు. ఈ హత్యలు చేస్తున్నది ఎవరు? కారణాలేంటి? భూతద్దం భాస్కర్ నారాయణకు ఈ కేసులతో సంబంధం ఏంటి? ఈ హత్యల మిస్టరీని ఛేదించే క్రమంలో అతడిది ఎదురైన సవాళ్లు ఏంటి?  అనే ప్రశ్నలతో ఈ సినిమా ముడిపడి ఉంటుంది. మరి, త్వరలో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఓటీటీ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom