iDreamPost
android-app
ios-app

OTT లోకి మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jul 23, 2024 | 5:00 AMUpdated Jul 23, 2024 | 5:00 AM

Bharathanatyam OTT Streaming Date: ఇప్పుడు మళ్ళీ కామెడీ మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒకటి రెండు కాదు ఓటీటీ కు ప్రతి వారం ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతున్న క్రమంలో.. త్వరలో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bharathanatyam OTT Streaming Date: ఇప్పుడు మళ్ళీ కామెడీ మూవీస్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒకటి రెండు కాదు ఓటీటీ కు ప్రతి వారం ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతున్న క్రమంలో.. త్వరలో మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 23, 2024 | 5:00 AMUpdated Jul 23, 2024 | 5:00 AM
OTT లోకి మరో క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఇప్పుడు ఓటీటీ లకు క్రేజ్ పెరగడమే కాకుండా .. వాటిలో ప్రత్యేకించి తెలుగు సినిమాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. అందులోను ప్రత్యేకించి ఇప్పుడు ఓటీటీ లో కామెడీ మూవీస్ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి తీరాల్సిందే. కనీసం వారంలో ఒకటైన కామెడీ మూవీ ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. మొత్తానికి అందరిని నవ్వించడానికి ఫిక్స్ అయినట్టున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాను ఓటీటీ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ, ఎప్పటినుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లోకి రాబోతున్న ఈ సినిమా పేరు “భరతనాట్యం”. ఈ సినిమాకు దొరసాని మూవీ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 5 న థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాగా ఈ సినిమాలో సూర్య తేజ అయిలే, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక వారితో పాటు హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ, టెంపర్ వంశీ, గంగవ్వ ప్రధాన పాత్రలలో కనిపించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా.. జూలై 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ను అసలు మిస్ కాకుండా చూడండి.

ఇక భరత నాట్యం మూవీ కథ విషయానికొస్తే.. రాజు సుందరం అనే అతను ఓ ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు. అతను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ ఉంటాడు . అతని దగ్గర ఉన్న కొన్ని కథలను నిర్మాతలకు చెబుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం తనని ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేస్తూ ఉండేది. కానీ అతనికి మాత్రం ఇండస్ట్రీలోనే ఉండాలని కోరిక ఉంటుంది. అయితే అనుకోకుండా అతని తల్లి ఆరోగ్యం పాడవుతుంది. ఆ ఆపరేషన్ కోసం డబ్బు బాగా అవసరం అవుతుంది. దీనితో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? అతను అనుకున్న కల నెరవేరిందా లేదా డబ్బు సంపాదించాలి అనుకోడం వలన అతనికి ఏదైనా సమస్యలు ఎదురయ్యాయా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి