Tirupathi Rao
Best Techno Horror Movie: ఓటీటీల్లో మీరు ఇప్పటి వరకు హారర్ సినిమాలు చూసుంటారు. అలాగే టెక్నాలజీ బేస్ తో ఉండే సైన్స్ ఫిక్షన్ చూసుంటారు. కానీ, ఎప్పుడైనా ఒక టెక్నో హారర్ మూవీ చూశారా? అయితే మస్ట్ గా ఈ సినిమా చూసేయండి.
Best Techno Horror Movie: ఓటీటీల్లో మీరు ఇప్పటి వరకు హారర్ సినిమాలు చూసుంటారు. అలాగే టెక్నాలజీ బేస్ తో ఉండే సైన్స్ ఫిక్షన్ చూసుంటారు. కానీ, ఎప్పుడైనా ఒక టెక్నో హారర్ మూవీ చూశారా? అయితే మస్ట్ గా ఈ సినిమా చూసేయండి.
Tirupathi Rao
మీరు ఇప్పటివరకు ఓటీటీలో చాలా మూవీస్ చూసుంటారు. వాటిలో ఒకటి సైన్స్ ఫిక్షన్ మూవీ అయితే.. ఇంకొకటి హారర్ మూవీనో, యాక్షన్ మూవీనో అయ్యుంటది. కానీ, ఎప్పుడైనా ఒక టెన్నో హారర్ మూవీ చూశారా? ఏంటి వింటేనే కాస్త వింతగా అనిపిస్తోందా? అవును.. ఇండియన్ సినిమాలో.. అందలోనూ సౌత్ ఇండియా నుంచి ఒక సరికొత్త టెక్నో హారర్ మూవీ వచ్చింది. అయితే ఆ మూవీ అప్పట్లో మలయాళంలో రావడంతో చాలా మందికి తెలియలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఓటీటీలో తెగ వైరల్ అవుతోంది. చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఇలాంటి ఒక మూవీ ఉందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం అంటున్నారు.
ఒక సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనే.. ఒక యాక్టర్ ఆ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వస్తారు. ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసిన మంజు వారియర్.. ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది. మంజూ వారియర్ కు సౌత్ లో మంచి గుర్తింపు, క్రేజ్ ఉంది. మంజూ వారియర్ మూవీ చేస్తోంది అంటే ఆ సినిమాపై మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ఈ మూవీపై కూడా గట్టిగానే అంచనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. నిజానికి ఈ సినిమా 2021లోనే విడుదలైంది. కానీ, అప్పుడు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.
ఈ మూవీ మరేదో కాదు.. ‘చతుర్ ముఖం’. తెలుగు ఆడియన్స్ కి చాలా మందికి ఈ మూవీ పేరు తెలియకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఏ ఓటీటీలో ఉందా అని వెతికిమరీ చూసేస్తున్నారు. పైగా సౌత్ నుంచి వచ్చిన ఒక ఫస్ట్ టెక్నో హారర్ మూవీ చతుర్ ముఖం కావడం విశేషం. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా. మంజూ వారియర్ ఈ సినిమాని తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించిన తీరు అందరినీ అబ్బుర పరుస్తుంది. ఆమె పాత్రలో అన్ని షేడ్స్, ట్వీస్టులు ఉన్నాయి. నిజానికి మీకు టెక్నో హారర్ ఏంటి అనే అనుమానం వచ్చే ఉంటుంది. అదే ఈ చిత్రానికి ఫస్ట్ సక్సెస్ పాయింట్.
ఎందుకంటే ప్రేక్షకులకు హారర్ మూవీస్ తెలుసు, సైంటిఫిక్ మూవీస్ తెలుసు. కానీ, ఈ టెక్నో హారర్ ఏంటో తెలియదు. హారర్ మూవీస్ ఎలాగైతే ప్రాణాల కోసం పోరాడుతూ.. పరుగులు పెడుతూ ఉంటారో.. ఈ మూవీలో కూడా అలాగే ఉంటుంది. కంటికి కనిపించని ఫ్రీక్వెన్సీస్ ని వాడుకుని అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తారు. వారి ప్రాణాల మీద తీపితో పరుగులు పెట్టేలా చేస్తారు. అందుకే దీనికి టెక్నో హారర్ మూవీ అనే పేరు వచ్చింది. మరి.. చతుర్ ముఖం అనే ఈ టెక్నో హారర్ మూవీని మీరు ఇప్పటివరకు చూడకపోతే మాత్రం ఒకసారి చూసేయండి. ఇది ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది. అలాగే జీ5లో అయితే మలయాళం వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.