iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. . ఈ ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అవుద్ది

క్రైమ్ సినిమాలు ఓటీటీలో బాగా అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఈ మూవీస్ వాచ్ చేస్తున్నారు. ట్విస్ట్ అండ్ టర్న్ చూసి షాక్ అవుతుంటారు. అలాంటి మూవీ ఓటీటీలో అలరిస్తుంది.

క్రైమ్ సినిమాలు ఓటీటీలో బాగా అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఈ మూవీస్ వాచ్ చేస్తున్నారు. ట్విస్ట్ అండ్ టర్న్ చూసి షాక్ అవుతుంటారు. అలాంటి మూవీ ఓటీటీలో అలరిస్తుంది.

OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. . ఈ ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అవుద్ది

క్రైమ్ డ్రామాతో ఎన్ని సినిమాలు చూసినా వాచ్ చేస్తుంటారు మూవీ లవర్స్. ఇటీవల కాలంలో క్రైమ్ అండ్ సస్సెన్స్, థ్రిల్లర్ మూవీస్‌కు బాగా ఆదరణ పెరిగింది. ఇలాంటి సినిమాలు ఓటీటీలో ఉన్నాయా లేదా అని కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇవే కాదు.. డబ్బింగ్ చిత్రాల్లో ఈ జోనర్ మూవీస్ ఉంటే తప్పకుండా చూస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్‌తో పిక్చర్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. క్రైమ్ చిత్రాల్లో కాస్త సాగదీతగా అనిపించినా.. లాజిక్ మిస్సైతే మాత్రం పక్కన పెట్టేస్తుంటారు తెలుగు ఆడియన్స్. అయితే ఈ క్రైమ్ అండ్ కామెడీ మిక్స్ అయ్యి ఓ సినిమా ఇటీవల సందడి చేసింది. ఈ సినిమా మిస్ అయ్యి ఉంటే.. ఓ లుక్కేయండి.. మస్ట్ వాచబుల్ అనిపించకమానదు. ట్విస్టులతో మతి పోద్దీ.

ఇంతకు ఆ క్రైమ్ మూవీ ఏంటంటే.. పురుష ప్రేతం. 2023లో వచ్చిన మలయాళ మూవీ. హృదయం మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన దర్శన రాజేంద్రన్ ఇందులో హీరోయిన్. అప్పటి నుండి ఆమె సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. జయ జయ జయ జయ హేలో భర్తను కొట్టే భార్య పాత్రలో మెప్పించింది ఈ రింగుల బ్యూటీ. ఆ తర్వాత దర్శన నుండి వచ్చిన తదుపరి చిత్రమే పురుష ప్రేతమ్.. ఇది డైరెక్టుగా ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా నేరుగా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇది తెలుగులో కూడా ఎవిలబుల్‌గా ఉంది. దర్శకుడు కృషంద్ తెరకెక్కించిన ఈ మూవీలో అలెగ్జాండర్ ప్రశాంత్, జగదీష్ కీలక పాత్రలు. ఇక సినిమా ఫ్లాట్ విషయానికి వస్తే..

మూవీ స్టార్ట్ కాగానే.. ఓ గుర్తు తెలియని మృతదేహం నదిలో కనిపిస్తుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తారు. ఎస్సై సెబాస్టియన్ ఈ కేసు టేకప్ చేస్తాడు. ఈ శవాన్ని నీళ్లల్లో నుండి తీసి.. మార్చురీకి తరలిస్తారు. ఆ శవం ఎవరిదో తెలియదు. ఈ శవం స్మెల్ వస్తూ ఉంటుంది. దీంతో దాన్ని పూడ్చేస్తారు. అంతలో తన భర్త బాబి కనిపించడం లేదంటూ హీరోయిన్ (దర్శన) చెబుతుంది. ఆ శవం  తన భర్త బాబీదేమో అనిపిస్తుందని చెబుతుంది.  పోలీసులు ఆ శవం నీ భర్తది కాదని ఆమెకు నచ్చ చెప్పి పంపిస్తారు. కానీ ఆ శవాన్ని చూపించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. అయినా ఉపయోగం ఉండదు. చివరకు కోర్టును ఆశ్రయిస్తుంది. కోర్టు ఆ శవాన్ని చూపించాలని చెబుతుంది. కానీ ఆ మృతదేహం ఎక్కడ ఉందో పోలీసులకు కూడా తెలియదు. మరీ ఆ మృతదేహం దొరికిందా.. ఇంతకు ఆ మృతదేహం ఎవరిదీ తెలియాలంటే ఈ సినిమా చూసేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి