iDreamPost
android-app
ios-app

OTTలో టాప్ 6 వెబ్ సిరీస్ లు ఇవే.. ఎక్కడ చూడాలంటే?

  • Published Aug 06, 2024 | 8:36 AM Updated Updated Aug 06, 2024 | 8:36 AM

ఇప్పటికే ఓటీటీలో తెలుగుతో పాటు విభన్న భాషాల్లో కామెడీ, లవ్, రోమాంటిక్ ను జోడిస్తూ ఎన్నో వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరీ, వాటిలోఈ టాప్ 6 వెబ్ సిరీస్ ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ ను చూడకుండా ఉంటే వెంటనే వీటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంతకీ ఎక్కడంటే..

ఇప్పటికే ఓటీటీలో తెలుగుతో పాటు విభన్న భాషాల్లో కామెడీ, లవ్, రోమాంటిక్ ను జోడిస్తూ ఎన్నో వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరీ, వాటిలోఈ టాప్ 6 వెబ్ సిరీస్ ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ ను చూడకుండా ఉంటే వెంటనే వీటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 06, 2024 | 8:36 AMUpdated Aug 06, 2024 | 8:36 AM
OTTలో టాప్ 6 వెబ్ సిరీస్ లు ఇవే.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలో ఇప్పుడు డిఫరెంట్ కాన్సేఫ్ట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ఆదరణ చాలా ఎక్కువగా పెరిగిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే చిన్నచిన్న యాక్టర్స్ దగ్గర నుంచి స్టార్ యాక్టర్స్ వరకు ప్రతిఒక్కరూ వెబ్ సిరీస్ ల మీదనే స్పేషల్ ఫోకస్ పెడుతున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. ఈ మధ్య హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ తరహా వెబ్ సిరీస్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వాటితో పాటు కామెడీ వెబ్ సిరీస్ ల పై కూడా ఓ కన్ను వేసి ఉంటారు. ఎందుకంటే.. ఈ తరహా వెబ్ సిరీస్ వస్తే.. ఫ్యామిలి మొత్త కలిసి చూడవచ్చని, కడుపుబ్బా నవ్వవచ్చని కోరుకుంటారు.

ఇక ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ లోటు కూడా తీరిపోతుంది. ఇప్పటికే తెలుగుతో పాటు విభన్న భాషాల్లో కామెడీ, లవ్, రోమాంటిక్ ను జోడిస్తూ ఎన్నో వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరీ, వాటిలోఈ టాప్ 6 వెబ్ సిరీస్ ఎప్పుడైనా చూశారా.. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ ను చూడకుండా ఉంటే వెంటనే వీటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఏ ఏ ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉన్నాయో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పంచాయత్: అమోజాన్ ప్రైమ్

‘పంచాయత్’.. ఇదొక కామెడీ, ఎమోషనల్ సిరీస్. అయితే ఈ సిరీస్ మొదటిగా 2020 లో మొదటి సీజన్ రాగా, ఆ తర్వాత రెండవ సీజన్ 2022 లో వచ్చింది. ఇక రెండు సీజన్స్ బాగా ఆకట్టుకోవడంతో.. 2024లోని మే 28న మూడవ సీజన్ ను కూడా విడుదల చేశారు. కాగా, ఇందులో నీనా గుప్తా, జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్ నటించారు. ఇకపోతే ఈ సిరీస్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ. అంతేకాకుండా.. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఇదొక బెస్ట్ కామెడీ సిరీస్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సిరీస్ ప్రస్తుతం అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

హాస్టల్ డేజ్
యూత్ కామెడీ డ్రామా రూపొందించిన వెబ్ సిరీస్ ‘హాస్టల్ డేజ్’. దీనిని ది వైరల్ ఫీవర్ (TVF) చేత రూపొందించబడింది మరియు అభినవ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు 5 ఏపిసోడ్ లు గా తెరకెక్కయి. కాగా, ఇటీవలే 6వ సీజన్ కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఆరు ఎపిసోడ్‌ల సిరీస్‌లో అహ్సాస్ చన్నా, లవ్ విస్పుటే, శుభమ్ గౌర్, నిఖిల్ విజయ్, ఆయుషి గుప్తా, ఉత్సవ్ సర్కార్ స్నేహితులుగా ఈ సిరీస్ లో నటించారు. అయితే ఈ సిరీస్ ను ఇప్పటి వరకు చూడకుండా ఉంటే వెంటనే దీనిన అమోజాన్ ప్రైమ్ లో చూసేయండి.

గుల్లక్:  సోనీలివ్ 
ఓ మధ్య తరగతి కుటుంబం, భార్యా భర్త..వారి ఇద్దరు పిల్లల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించే వెబ్ సిరీస్ ‘గుల్లక్’. ఈ సిరస్ ను ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చు. దీనిని ది వైరల్ ఫీవర్ (TVF) బ్యానర్‌పై శ్రేయాన్ష్ పాండే ఈ సిరీస్‌ని రూపొందించారు. ఇక ఈ సిరీస్ లో జమీల్ ఖాన్, గీతాంజలి కులకర్ణి, వైభవ్ రాజ్ గుప్తా, హర్ష్ మాయర్, సునీతా రాజ్వార్, సాద్ బిల్గ్రామి మరియు దీపక్ కుమార్ మిశ్రా కీలక పాత్రల్లో నటించారు. అయితే ఇప్పటికే గుల్లక్ 3 సిరీస్ లతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఇటీవలే 4వ సీజన్ రిలీజ్ అయ్యింది. కాగా, ఈ సిరీస్ సోనీలివ్ లో హిందీతో పాటు హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేసింది.

మిస్‌మ్యాచ్డ్: అమెజాన్ మినీటీవీ

‘మిస్‌మ్యాచ్డ్’.. ఈ వెబ్ సిరీస్ ను సంధ్యా మీనన్ రాసిన ‘వెన్ డింపుల్ మెట్ రిషి’ నవల ఆధారంగా తెరకెక్కించారు.కాగా, ఇందులో ప్రజక్తా కోలి, రోహిత్ సరాఫ్, రణ్‌విజయ్ సింఘా, విద్యా మాల్వాడే ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సిరీస్ లో సమ్మర్ కోడింగ్ ప్రోగ్రామ్‌ కోసం రిజిస్టర్ చేసుకున్న డింపుల్, రిషి అనే ఇద్దరు వ్యక్తుల కథను సిరీస్‌లో చూపించారు.అలాగే మోడ్రన్ ఇండియన్ సొసైటీలో లవ్, ఫ్రెండ్‌షిప్, రొమాన్స్, సెల్ఫ్ డిస్కవరీ వంటి థీమ్స్‌ను కూడా ఈ సిరీస్‌లో చూపించారు. ముఖ్యంగా ఈ సిరీస్ యువతకు బాగా కనెక్ట్ అయిన విధంగా ఉంటుంది. మరీ ఈ సిరీస్ చూడాలనుకుంటే..అమెజాన్ మినీటీవీలో అందుబాటులో ఉంది.

క్యాంపస్ బీట్స్

 ‘క్యాంపస్ బీట్స్ సిరీస్’.. ఇదొక టీన్ డ్రామా వెబ్ సిరీస్. అయితే ఇది 2023లో సెప్టెంబర్ 21న అమెజాన్ మినీ టీవీలో విడుదలైంది. కాగా, ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటుడు శంతను మహేశ్వరి , శ్రుతి సిన్హా, సహజ్ సింగ్ చాహల్, తన్వీ గడ్కరీ, హర్ష్ డింగ్వానీ, తాన్యా భూషణ్, ధన్‌శ్రీ ఉన్నారు. యాదవ్, తేరియా మగర్, అద్నాన్ ఖాన్ మరియు రోహన్ పాల్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సిరీస్ అనేది కళాశాల రోజుల్లో విద్యార్థుల మధ్య స్నేహం, ప్రేమ తీవ్రమైన పోటీని రేకెత్తించడంతో సాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్ చూడకుండా ఉంటే వెంటనే దీనిని అమోజన్ మినీ టీవీలో చూసేయండి.

ఆపరేషన్

‘ఆపరేషన్ ఎంబీబీఎస్’.. ఈ సిరీస్ MBBS కళాశాలలో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన ముగ్గురు వైద్య విద్యార్థుల జీవితాల మధ్య సాగే కథ. కాగా, ఈ సిరీస్ ను అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సిరీస్ లో ఆయుష్ మెహ్రా , అన్షుల్ చౌహాన్, సారా హష్మీ ప్రధాన పాత్రలో నటించారు.అయితే ఈ సిరీస్ ను ప్రైమ్ వీడియో తో పాటు, అమోజాన్ మినీ టీవిలో కూడా చూసేయవచ్చు. ముఖ్యంగా ఈ సిరీస్ యూత్ కు ఎంతగానే ఆకట్టుకుంటుంది.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritbet güncel girişJojobet GirişcasibomHoliganbetgalabet girişHoliganbetJojobetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbetjojobetjojobetcasibomcasibom