iDreamPost
android-app
ios-app

OTT లోకి రానున్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ‘బెంచ్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Aug 26, 2024 | 7:14 PM Updated Updated Aug 26, 2024 | 7:14 PM

OTT New Release- Bench Life Telugu Web Series: తెలుగు వెబ్ సిరీస్ లకు ఈ మధ్య ఆదరణ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఓటీటీ లో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక వెబ్ తెలుగు వెబ్ సిరీస్ యాడ్ అవ్వబోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

OTT New Release- Bench Life Telugu Web Series: తెలుగు వెబ్ సిరీస్ లకు ఈ మధ్య ఆదరణ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఓటీటీ లో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక వెబ్ తెలుగు వెబ్ సిరీస్ యాడ్ అవ్వబోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 26, 2024 | 7:14 PMUpdated Aug 26, 2024 | 7:14 PM
OTT లోకి రానున్న  తెలుగు కామెడీ వెబ్ సిరీస్ ‘బెంచ్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఒకటప్పటితో పోల్చుకుంటే.. ఇప్పుడు ఓటీటీ లకు బాగా ఆదరణ పెరిగింది. అందులోను తెలుగు కంటెంట్ కు మరింత క్రేజ్ లభిస్తుంది. గత కొన్ని వారాలుగా ప్రతి వారం ఎదో ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. దానికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది. ఎలాగూ ఇప్పుడు వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా లభిస్తుంది కాబట్టి ఈ సిరీస్ కూడా కచ్చితంగా అందరిని మెప్పిస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సిరీస్ ఐటీ జాబ్ లో జాయిన్ అయినా.. ప్రతి ఒక్కరికి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సాధారణంగా ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఉద్యోగులను బెంచ్ లో ఉన్నట్లుగా చెప్తారు. దీనిపై చాలా జోక్స్ కూడా వేస్తూ ఉంటారు. ఇలాంటి కాన్సెప్ట్ మీదనే ఓ సిరీస్ రాబోతుంది. ఆ తెలుగు సిరీస్ పేరు ‘బెంచ్ లైఫ్’. ఈ సిరీస్ కు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప్పుడు మరొక వెబ్ సిరీస్.. కాగా ఈ సిరీస్ లో వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్ ప్రధాన పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.

ఇక ఈ సిరీస్ ట్రైలర్ విషయానికొస్తే.. సాధారణంగా ఐటీ లో బెంచ్ వచ్చిందంటే.. వర్క్ ఉండదు ఖాళీగా ఉండొచ్చని.. చాలా మంది హ్యాపీ అవుతూ ఉంటారు. అలాంటి సీన్స్ తోనే ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో బెంచ్ లో వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్ ఉంటారు. వైభవ్ అనే అతను ఓ అమ్మాయిని ప్రేమలో పడేసే పనిలో పడతాడు. ఇక రితిక సింగ్ అపార్ట్మెంట్ లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటుంది. చరణ్ గోవా వెళ్లే ప్లాన్ చేస్తుంటాడు. అయితే అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ఉంటుంది. అయితే వీరు ముగ్గురు పని చేయకపోడంతో.. కంపెనీ ఖర్చు చేయించుకోడానికి.. ఫైర్ చేసే పనిలో ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది ? అనేదే మిగిలిన కథ. చాలా మంది కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాబట్టి.. ఈ సిరీస్ కచ్చితంగా సక్సెస్ అవుతుంది. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet