OTT లో రానా సమంత ‘బెంగళూరు డేస్’ రీమేక్ మూవీ… ఇప్పుడు తెలుగులో

Banglore Days Movie Telugu OTT: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తుందని చెప్పడం కంటే కూడా.. ఓటీటీ లో తెలుగు సినిమాల ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా ఎనిమిదేళ్ల తర్వాత ఓ సినిమా తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.

Banglore Days Movie Telugu OTT: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తుందని చెప్పడం కంటే కూడా.. ఓటీటీ లో తెలుగు సినిమాల ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తాజాగా ఎనిమిదేళ్ల తర్వాత ఓ సినిమా తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా అందరు ముందు సెర్చ్ చేసేది తెలుగు సినిమాల కోసమే. తెలుగు కంటెంట్ కు ప్రేక్షకులలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ప్రతి వారం సరికొత్త కథలతో కొత్త సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఆల్రెడీ వేరే లాంగ్వేజ్స్ లో బాగా బజ్ ఉన్న సినిమాలను తెలుగు వెర్షన్ ను.. ఇప్పుడు స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల తర్వాత.. రాణా , సమంత నటించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ తెలుగు వెర్షన్.. డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా మరేదో కాదు.. 2014 లో మలయాళంలో దుల్కర్, నజ్రియా, పార్వతి , నివిన్ పౌలి ప్రధాన పాత్రలలో నటించిన ‘బెంగళూరు డేస్’ మూవీ.. ఇప్పటికి అందరి ఫేవరేట్ వాచ్ లిస్ట్ లో ఉంటుంది. అసలు మలయాళం సినిమాలంటే అందరికి ముందు గుర్తొచ్చేది ఈ సినిమానే. ఇక ఇదే సినిమాను 2016 లో తమిళంలో ఆర్య,శ్రీ విద్య, రానా , సమంత కలిసి నటించారు. అప్ప్పట్లో దీనిని తెలుగు వెర్షన్ లో కూడా థియేటర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ.. అది జరగలేదు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఓటీటీ లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం వెర్షన్ ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమా అంతా కూడా ముగ్గురు స్నేహితులు చుట్టూ కొనసాగుతూ ఉంటుంది. వారి మధ్య స్నేహం. వారి పెళ్లిళ్ల తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులు. ప్రేమ , పంతం , లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం వారు తీసుకునే నిర్ణయాలు ఇలాంటి ఎన్నో అంశాల కలయిక ఈ సినిమా. ఈ మూవీ మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా.. ప్రేక్షకులకు మంచి ఫీల్ ను ఇస్తుంది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని ఈ మూవీని.. ఇప్పుడు ఎంచక్కా తెలుగులో చూసేయండి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మియా అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments