iDreamPost
android-app
ios-app

Aquaman 2 OTT: OTT లోకి వచ్చేసిన ఆక్వామెన్ 2.. తెలుగులో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published May 21, 2024 | 5:15 PM Updated Updated May 21, 2024 | 5:15 PM

ఓటీటీ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇతర భాషల చిత్రాలకు కూడా ఇక్కడ ఆదరణ బాగా పెరిగిపోవడంతో.. మేకర్స్ కూడా ఆయా సినిమాలను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది.

ఓటీటీ లో వచ్చే సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇతర భాషల చిత్రాలకు కూడా ఇక్కడ ఆదరణ బాగా పెరిగిపోవడంతో.. మేకర్స్ కూడా ఆయా సినిమాలను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది.

  • Published May 21, 2024 | 5:15 PMUpdated May 21, 2024 | 5:15 PM
Aquaman 2 OTT: OTT లోకి వచ్చేసిన ఆక్వామెన్ 2..  తెలుగులో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఇప్పుడు సమ్మర్ కావడంతో.. బయటకు వెళ్లేందుకు అంతగా ఇష్టపడడంలేదు ప్రజలు.. దీనితో ఎంచక్కా ఇంట్లోనే ఉండి చిల్ అవ్వడానికి చూస్తున్నారు. అందుకోసం ఉన్న ఒకే ఒక్క మార్గం ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్. దీనితో ఓటీటీ లోకి వచ్చినవి వచ్చినట్లు చూసేస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న ఓ సినిమా తాజాగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. థియేటర్ లో అయితే.. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ నే సంపాదించుకుంది. మరి ఓటీటీ లో ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం .

ఈ సినిమా మరేదో కాదు.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన.. ఆక్వామెన్ 2. ఈ సినిమాకు జేమ్స్ వాన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో జాసన్ మోమోవా ఆర్థర్ కర్రీ ఆక్వామెన్ గా నటించారు, జాసన్ మోమోవా ఆర్థర్ కర్రీతో పాటు.. అంబర్ హర్డ్, రాండాల్ పార్క్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, టెమ్యురా మారిసన్, మార్టిన్ షార్ట్, నికోల్ కిడ్‌మాన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా 2023 డిసెంబర్ 22 న థియేటర్ లో రిలీజ్ చేయగా.. మొదటినుంచి కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అటు కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పైగా ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, కన్నడ , తమిళం భాషలలో ఓటీటీ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. జియో సినిమాలో మే 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మొత్తంగా 434.4 మిలయన్ డాలర్ల కలెక్షన్స్ ను వసూళ్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ వీకెండ్ ఎలాగూ థియేటర్ లో చూడదగిన సినిమాలు లేవు కాబట్టి.. ఎంచక్కా ఓటీటీ లో ఉండే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసేయండి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş