iDreamPost
android-app
ios-app

OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jun 21, 2024 | 11:31 AMUpdated Jun 21, 2024 | 11:31 AM

ఇప్పుడు వెబ్ సిరీస్ లను ఇష్టపడని వారు ఎవరు ఉండడం లేదు. తెలుగులోనూ ఇప్పుడు కొత్త కొత్త కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. మరి ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఇప్పుడు వెబ్ సిరీస్ లను ఇష్టపడని వారు ఎవరు ఉండడం లేదు. తెలుగులోనూ ఇప్పుడు కొత్త కొత్త కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. మరి ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published Jun 21, 2024 | 11:31 AMUpdated Jun 21, 2024 | 11:31 AM
OTT లోకి మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వస్తుంది అంటేనే.. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. మరి అదే ఓ తెలుగు వెబ్ సిరీస్ అయితే.. ప్రేక్షకులకు ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా హాట్ స్టార్ లో రొమాంటిక్ హర్రర్ జోనర్ లో యక్షిణి అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ గురించి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ సిరీస్ పై అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక రిలీజ్ తర్వాత అనుకున్న రేంజ్ లో కాకపోయినా ఈ సిరీస్ కు బాగానే పాపులారిటీ వస్తుంది. ఇప్పుడు ఇదే క్రమంలో.. మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ రాబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో.. ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

యక్షిణి వెబ్ సిరీస్ తర్వాత.. హాట్ స్టార్ మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. ఈ వెబ్ సిరీస్ పేరు “అగ్ని సాక్షి”. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక టైటిల్ లో అగ్నిసాక్షి పేరులో ఆఖరి అక్షరం ఐ ని ఓ కత్తి రూపంలో ఉంచారు మేకర్స్. పైగా దీనికి లవ్ ఫెయిల్యూర్ అనే ఓ ట్యాగ్ లైన్ ను కూడా పెట్టడం విశేషం. చూడబోతుంటే త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతుంది అనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ ను చూస్తే.. ఇది ఓ ప్రేమ జంట చుట్టూ తిరిగే కథల అనిపిస్తోంది. మరి ఈ సిరీస్ కథేంటో.. ఎవరెవరు దీనిలో నటిస్తున్నారో… ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో.. ఇవన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. “ప్రతి ఒక్కరి ఫేవరెట్ జంట తిరిగి వస్తోంది.. వాళ్లు ఎవరో గెస్ చేయగలరా?” అంటూ హాట్ స్టార్ ఈ సిరీస్ గురించి అనౌన్స్ చేసింది.

దీనితో అగ్నిసాక్షి అంటే అందరికి గుర్తొచ్చేది.. స్టార్ మా లో వచ్చిన సీరియల్ ఏ. మరి ఇక్కడ సిరీస్ లో కనిపించబోయేది కూడా ఈ జంటేనా .. ఏమో ఇలా అందరికి రకరకాల ప్రశ్నలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఈ కొత్త వెబ్ సిరీస్ వచ్చే లోపు.. ఆల్రెడీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న యక్షిణి వెబ్ సిరీస్ ను చూసేయండి. ఇక ఈ కొత్త వెబ్ సిరీస్ గురించి మిగిలిన విషయాలు తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి