iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Aug 05, 2024 | 4:12 PM Updated Updated Aug 05, 2024 | 4:12 PM

OTT Thriller Movie: డైరెక్ట్ గా ఓటీటీ లోకి వస్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోతుంది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలను చూసేద్దాం.

OTT Thriller Movie: డైరెక్ట్ గా ఓటీటీ లోకి వస్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోతుంది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలను చూసేద్దాం.

  • Published Aug 05, 2024 | 4:12 PMUpdated Aug 05, 2024 | 4:12 PM
డైరెక్ట్ గా OTT లోకి  బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

టాలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా ఓటీటీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇక వీటిలో ఈ మధ్య డైరెక్ట్ గా ఓటీటీ లో వస్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. వెండి తెరపై అలరించిన ఎంతో మంది నటి నటులు.. ఓటీటీ లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. వారు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఈ క్రమంలో.. ఓటీటీ లోకి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మూవీ రాబోతుంది. ఆల్రెడీ తెలుగులో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ అమ్మడు. మరి ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతున్న మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

అనన్య పాండే బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పించేందుకు రెడీ అయిపోతుంది. అది కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సైబర్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా పేరు “కంట్రోల్”(CTRL). కీ బోర్డు లో ఉండే కంట్రోల్ బటన్ CTRL ను ఈ మూవీ టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. దీనిని డైరెక్ట్ గా ఓటీటీ లోకి తీసుకుని వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతం ఇంటర్నెట్ ఉపయోగించని వారు ఎవరు లేరు. ఈ క్రమంలో చాలా మంది అనేక సైబర్ నేరాలకు గురి అవుతూనే ఉన్నారు. దీనిపై ఎంత మంది ఎన్ని విధాలుగా అవగాహనా కల్పించినా కానీ.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రజల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు కంట్రోల్ మూవీ కూడా ఇదే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. “మీ సంతోషం, మీ రిలేషన్‍షిప్స్, మీ జీవితం మీ కంట్రోల్‍లోనే ఉన్నాయని భావిస్తున్నారా.. మళ్లీ ఆలోచించండి” అంటూ.. ఈ మూవీ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించగా.. అనన్య పాండే , విహాన్ సమత్ ప్రధాన పాత్రలలో నటించారు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.