iDreamPost
android-app
ios-app

ప్రముఖ OTTలో.. అనంత్- రాధికల వివాహ వేడుకలు ప్రసారం!

  • Published Jul 06, 2024 | 10:42 AM Updated Updated Jul 06, 2024 | 10:42 AM

Anant Ambani And Radhika Merchant Wedding On This OTT: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహం జులై 12న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకల ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ దక్కించుకుంది.

Anant Ambani And Radhika Merchant Wedding On This OTT: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహం జులై 12న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకల ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ దక్కించుకుంది.

  • Published Jul 06, 2024 | 10:42 AMUpdated Jul 06, 2024 | 10:42 AM
ప్రముఖ OTTలో.. అనంత్- రాధికల వివాహ వేడుకలు ప్రసారం!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వివాహం మాత్రం వైరల్ అవుతోంది. అది మరెవరిదో కాదు.. ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల వివాహం గురించి. వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఏం చేసినా కూడా దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఇటీవలే 50 జంటలకు వివాహం చేసి వారికి ఘనంగా బహుమతులు కూడా ఇచ్చారు. ఇలా అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ లో వివాహం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. అయితే ఆ వివాహానికి వెళ్లేందుకు అందరికీ సాధ్యం కాదు. కానీ, మీరు వారి వివాహాన్ని అయితే చూడచ్చు. అందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు వారి వివాహ ప్రసార హక్కులను అప్పగించారు.

ఇప్పటి వరకు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల వివాహ వేడుకలకు సంబంధించి అన్ని విషయాలను ప్రజలు చూస్తూనే ఉన్నారు. రెండుసార్లు ఘనంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. మొదట జామ్ నగర్ లో ఈ వేడుకలు జరిగాయి. అలాగే 50 వేల మందికి అన్న సేవ కూడా చేశారు. ఆ తర్వాత ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు క్రూయిజ్ షిప్ లో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఆ తర్వాత వారి వివాహ వేడుకల్లో భాగంగా 50 నిరుపేద జంటలకు ఘనంగా సామూహిక వివాహం చేశారు. ఇంక ఇప్పుడు అసలు వివాహానికి సమయం ఆసన్నమైంది. అయితే వారి వివాహ వేడుకలను తిలకించేందుకు అందరికీ ఒక అవకాశం అయితే ఉంది. వారి వివాహాన్ని ప్రసారం చేసే హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

సాధారణంగా వారి వివాహం జియో సినిమాలో వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటారు. కానీ, అనూహ్యంగా ఆ ప్రసార హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. జులై 12న వారి వివాహాన్ని ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందరూ చూడచ్చు. ఇంక పెళ్లి వేడుకల విషయానికి వస్తే.. జులై 12న ‘శుభ్ వివాహ్ తో’ వేడుకలు స్టార్ట్ అవుతాయి. జులై 13న శుభ్ ఆశ్వీర్వాద్.. జులై 14న మంగళ్ ఉత్సవ్ కార్యక్రమంతో ఈ వివాహ వేడుకలు ముగియనున్నాయి. ప్రస్తుతం అంతా ఈ వివాహం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంటే ప్రీ వెడ్డింగ్ వంటివే ఇంత ఘనంగా చేస్తే అసలు వివాహం ఇంకా ఎంత గ్రాండ్ గా ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. తాజాగా సంగీత్ కూడా నిర్వహించారు. ఈ సంగీత్ కు అనంత్ అంబానీ అసలైన బంగారంతో చేసిన సంప్రదాయ దుస్తులను ధరించారు. రాధికా మర్చంట్ క్రిస్టల్ డ్రెస్ లో తళుక్కుమంది.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş