iDreamPost
android-app
ios-app

నెలలోపే OTT లోకి బాలీవుడ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 01, 2024 | 1:26 PM Updated Updated Aug 01, 2024 | 1:26 PM

Bollywood Movie In OTT: చాలా వరకు సినిమాలన్నీ కూడా నెల రోజులు కాకుండానే ఓటీటీ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే వివరాలు చూసేద్దాం.

Bollywood Movie In OTT: చాలా వరకు సినిమాలన్నీ కూడా నెల రోజులు కాకుండానే ఓటీటీ లోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే వివరాలు చూసేద్దాం.

  • Published Aug 01, 2024 | 1:26 PMUpdated Aug 01, 2024 | 1:26 PM
నెలలోపే OTT లోకి బాలీవుడ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజులు కాకుండానే ఓటీటీ లలోకి రావడం.. ఇప్పుడు అందరికి అలవాటు అయినా విషయమే. ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలన్నీ కూడా ఇలా థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయో లేదో.. వెంటనే ఓటీటీ పార్ట్నర్స్ ను ఫిక్స్ చేసుకుని.. నెల తిరగకుండానే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. ఆ సినిమా మరేదో కాదు అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ.. ‘సర్ఫిరా’ మూవీ. మరి ఈ సినిమా ఎప్పుడు , ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

అక్షయ్ కుమార్ నటించిన ఈ సర్ఫిరా మూవీ.. కోలీవుడ్ లో సూర్య నటించిన సూరారై పొట్రు అనే ఈ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. కోలీవుడ్ లో ఈ సినిమా రిలీజ్ తర్వాత.. విమర్శకుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమా ఐదు జాతియా అవార్డ్స్ ను కూడా గెలుచుకుంది. తెలుగులో ఈ సినిమాను ఆకాశమే నీ హద్దురా అనే పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. కాగా హిందీ లో సుధా కొంగర ఈ మూవీ రీమేక్ వెర్షన్ కు దర్శకత్వం వహించారు. కానీ ఈ రీమేక్ వెర్షన్ కు మాత్రం థియేటర్స్ లో అంతగా సక్సెస్ సాధించలేకపోయింది. దీనితో వెంటనే ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. ఆగష్టు 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఇక సర్ఫిరా సినిమా విషయానికొస్తే.. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించగా.. కేవలం 30 కోట్ల‌లోపు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఎక్కడ లోపం జరిగిందో తెలియదు కానీ.. టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను హిట్ అయినా మూవీ బాలీవుడ్ లో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. కాగా సర్ఫిరా మూవీలో అక్షయ్ కుమార్ తో పాటు.. రాధిక మదన్ , పరేష్ రావల్ , శరత్ కుమార్ ముఖ్య పాత్రలలో నటించారు. ఇక మూవీ గురించి అందరికి తెలిసిందే. కమర్షియల్ పరంగా సర్ఫిరా మూవీ ఎలా ఉన్నా కానీ.. అక్షయ్ కుమార్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరి ఓటీటీ లో ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet