iDreamPost
android-app
ios-app

Agnisakshi Web Series OTT:మరో సారి కొత్త కథతో ‘అగ్నిసాక్షి’.. కానీ ఈసారి OTT లో! స్ట్రీమింగ్ ఎప్ప్పటినుంచంటే ?

  • Published Jun 25, 2024 | 1:50 PM Updated Updated Jun 25, 2024 | 6:29 PM

2017 లో స్టార్ మా లో ప్రసారం అయినా అగ్నిసాక్షి సీరియల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే జంట అర్జున్ అంబటి, ఐశ్వర్య మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈసారి టీవీ లో కాదు ఓటీటీ లో.. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

2017 లో స్టార్ మా లో ప్రసారం అయినా అగ్నిసాక్షి సీరియల్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే జంట అర్జున్ అంబటి, ఐశ్వర్య మరొకసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈసారి టీవీ లో కాదు ఓటీటీ లో.. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 25, 2024 | 1:50 PMUpdated Jun 25, 2024 | 6:29 PM
Agnisakshi Web Series OTT:మరో సారి కొత్త కథతో ‘అగ్నిసాక్షి’.. కానీ ఈసారి OTT లో! స్ట్రీమింగ్ ఎప్ప్పటినుంచంటే ?

స్టార్ మా ఛానెల్ లో 2017 లో ప్రసారం అయినా అగ్నిసాక్షి సీరియల్ కు.. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఈ సీరియల్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు. అర్జున్ అంబటి, ఐశ్వర్య ఈ సీరియల్ లో జంటగా నటించారు. సీరియల్ కథకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఈ జోడీకు కూడా అంతే మంది అభిమానులు ఉన్నారని చెప్పి తీరాల్సిందే. ఈ సీరియల్ ప్రోమో రిలీజ్ అయినప్పటినుంచి.. చివరి ఎపిసోడ్ వరకు కూడా.. ప్రతి ఎపిసోడ్ అంతే ఇంట్రెస్ట్ తో .. కొనసాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే జంట నుంచి ఇదే టైటిల్ తో మరో సస్పెన్స్ డ్రామా వచ్చేస్తోంది. అయితే అది సీరియల్ కాదు.. టెలివిజన్ కోసం అంత కన్నా కాదు.. ఈసారి ఓటీటీ కోసం. మరి దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

“స్టార్ మా ప్రేక్షకుల మనస్సాక్షి… అగ్నిసాక్షి. అదే జంటతో… అదే పేరుతో… డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రికొత్త సస్పెన్స్ థ్రిల్లర్” అంటూ హాట్ స్టార్ తాజాగా అగ్నిసాక్షి ప్రోమోను రిలీజ్ చేసింది.. “కొత్త జీవితం, కొత్త కథ” అంటూ ఈ ప్రోమో ఎండ్ టైటిల్స్ ఓ వేసింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ను గమనిస్తే.. ఈ సరి కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ లో శంకర్ పాత్రలో అర్జున్ నటించనున్నారు. కానీ ఇందులో కాస్త మాస్ యాంగిల్ లుక్ కనిపిస్తుంది. అప్పుడప్పుడూ బీడీ విల్ ఫైర్’ అంటూ ఆయన గన్ ఫైరింగ్ చేశారు. ఇక పోలీస్ అధికారి గౌరీ పాత్రలో ఐశ్వర్య నటించింది. మరి శంకర్ ఎవరు ! గౌరీ ఎవరు! వీరిద్దరికి ఎలాంటి పరిచయం ఏర్పడుతుంది ! అసలు కథేంటి ! ఇలా అందరికి ప్రశ్నలు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇవన్నీ తెలియాలంటే జులై 12 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. జులై 12 నుంచి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

అయితే అగ్నిసాక్షి సీరియల్ కు.. త్వరలో ఓటీటీ లోకి రానున్న సరికొత్త అగ్నిసాక్షికి మాత్రం ఎలాంటి సంబంధం లేదన్న విషయం.. క్లియర్ గా తెలిసిపోతుంది. ఎలాగూ స్ట్రీమింగ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటివరకు వెండి తెరపైన కనిపించే నటి నటులు ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తూ వస్తున్నాం. అటు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసే వారు కూడా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు సీరియల్ నటి నటులు.. అదే సీరియల్ నేమ్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి ఈసారి అగ్నిసాక్షి ఎంత మందిని మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş