Agni Sakshi Series Review: అగ్నిసాక్షి వెబ్ సిరీస్ రివ్యూ!

Agni Sakshi Web Series Review In Telugu: కొన్నేళ్ల తర్వాత ఒక సూపర్ హిట్ సీరియల్.. కథ మార్చుకని కొత్త క్రైమ్ థ్రిల్లర్ లా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ లా దీనినీ తీసుకొచ్చారు.

Agni Sakshi Web Series Review In Telugu: కొన్నేళ్ల తర్వాత ఒక సూపర్ హిట్ సీరియల్.. కథ మార్చుకని కొత్త క్రైమ్ థ్రిల్లర్ లా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ లా దీనినీ తీసుకొచ్చారు.

అగ్నిసాక్షి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే ఈ పేరు మీద వచ్చిన సీరియల్ కు అంతా ఫిదా అయిపోయారు. కొన్నేళ్లపాటు ఈ సిరీయల్ టాప్ లో కొనసాగింది. ఇప్పుడు ఇదే పేరు.. అదే లీడ్ యాక్టర్స్ తో అగ్ని సాక్షి అనే వెబ్ సిరీస్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జులై 12న స్టార్ట్ అయిన ఈ సిరీస్.. ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం ఓటీటీలో 4 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. మరి.. ఈ అగ్నిసాక్షి వెబ్ సిరీస్ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తుందా? చూద్దాం.

ఈ సిరీస్ లో మరీ పెద్ద కథ.. పెద్ద పెద్ద పాయింట్స్ ఏమీ లేవు. చాలా సింపుల్ స్టోరీని తెరకెక్కిస్తున్న విషయాన్ని చూపించారు. ఈ సిరీస్ లో ఒక మాస్క్ మ్యాన్ ఉంటాడు. అతను అమ్మాయిలను హత్యలు చేస్తుంటాడు. మొదటి ఎపిసోడ్ లోనే ఆ విలన్ ని పరిచయం చేశారు. పెళ్లి చేసుకోబోతున్న ఒక అమ్మాయిని చంపేసి.. ఆమె జుట్టు కత్తిరించుకుని వెళ్తాడు. అయితే అతని టార్గెట్ గౌరి అనే విషయాన్ని చూపిస్తారు. ఆమెను చంపాలి అని ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. ఇంక హీరో శంకర్ నీతి, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్.. ప్రస్తుతానికి అండర్ కవర్ లో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తుంటాడు.

రాఖీ భాయ్ గ్యాంగ్ లో చేరి ఎలాగైనా అతడిని పట్టుకోవాలి అనేది హీరో టార్గెట్. అందుకోసం ఖలీద్ అనే వాడి సాయంతో గ్యాంగ్ లో చేరాలి అని చూస్తాడు. కానీ, గౌరీ వల్ల ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. ఇప్పటికే గౌరీ శంకర్ రెండుసార్లు కలిశారు. ఆ రెండు సార్లు గొడవే అవుతుంది. హీరోయిన్ టార్గెట్ కూడా పోలీసు అవ్వడమే.. కానీ, రిటన్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతుంది. గౌరీని ఆ మాస్క్ మ్యాన్ కారుతో గుద్ది చంపాలి అని చూస్తాడు. ఆ సమయంలో శంకర్ వచ్చి కాపాడతాడు. గౌరీ కారణంగా శంకర్ ప్రయత్నం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ కథలో మధ్య మధ్యలో గౌరీ- శంకర్ లా కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తూ వస్తున్నారు.

గౌరీకి తల్లిదండ్రులు లేరు. తన పిన్నీ- బాబాయిల దగ్గర పెరుగుతూ ఉంటుంది. అలాగే శంకర్ కు కూడా తల్లిదండ్రులు లేరు. అతని అన్నా- వదినలు కూడా పోలీసు ఆఫీసర్లే. కానీ, తన వదిన చేసిన పనికి.. మనస్తాపానికి గురైన అన్న గన్ తో ఆమెను కాల్చి.. తాను కూడా కాల్చుకుని చనిపోతాడు. ఆ ఘటన ప్రభావం వీళ్లను వెంటాడుతూనే ఉంటుంది. అది కారణంగా చూపించి శంకర్ చెల్లి సత్యను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. శంకర్ కు తమ్ముడు విజయ్ కూడా ఉన్నాడు.

మరోవైపు గౌరీకి మాస్క్ మ్యాన్ నుంచి గండం మరింత పెరుగుతూ ఉంటుంది. అతను నేరుగా ఆమె గదిలోకి వస్తాడు. ఆమెకు తెలియకుండా కొంత జుట్టును కట్ చేసి తీసుకెళ్లిపోతాడు. పోలీసు అవ్వాలి అని ఉద్యోగం మానేస్తుంది. ఆ కల ఎలాగూ తీరలేదు. మళ్లీ ఉద్యోగం చేసేందుకు కంపెనీకి వెళ్తుంది. అయితే అప్పటికే ఆ కంపెనీలో ప్రీతీ అనే అమ్మాయి రిజైన్ చేసి ఉంటుంది. ఆమె ప్లేస్ లో గౌరికి ఉద్యోగం ఇస్తారు. అయితే ప్రీతి మాస్క్ మ్యాన్ ఇంట్లో కనిపిస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అసలు మాస్క్ మ్యాన్ కి ప్రీతికి ఏంటి సంబంధం? గౌరీని చంపాలి అని ఎందుకు ఫిక్స్ అయ్యాడు? అందుకోసం ప్రీతిని కావాలనే గౌరీ ఉండే ఆఫీస్ లో పెట్టాడా? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలు వస్తాయి. ఇంక ఈ నాలుగు ఎపిసోడ్స్ లో అదే చూపించారు. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మీరు అగ్నిసాక్షి వెబ్ సిరీస్ వచ్చే ఎపిసోడ్స్ చూడాల్సిందే.

Show comments