iDreamPost
android-app
ios-app

OTTలోకి క‌ట్ట‌ప్ప యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?

  • Published Jul 24, 2024 | 10:23 AM Updated Updated Jul 24, 2024 | 10:23 AM

ఇటీవలే కోలీవుడ్ నటుడు సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా వెపన్. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది.

ఇటీవలే కోలీవుడ్ నటుడు సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా వెపన్. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది.

  • Published Jul 24, 2024 | 10:23 AMUpdated Jul 24, 2024 | 10:23 AM
OTTలోకి క‌ట్ట‌ప్ప  యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?

ఈ మధ్య యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ కు ప్రేక్షకుల నుంచి ఎంతటి ఆదరణ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న స్థాయి నటులు వరకు అందరూ డిఫరెంట్ కాన్సెఫ్ట్ లతో యాక్షన్ ఫిల్మ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఇప్పటికే విభిన్న కథలతో చాలా యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లు, ఓటీటీలో సందడి చేస్తున్నా విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..ఇటీవలే బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కూడా ఈ తరహా యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెపన్ ప్రధాన పాత్రలోని అలరించారు. కాగా, ఈ మూవీ జూన్ 7న థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆడియాన్స్ మెప్పించక డిజాస్టర్ గా నిలిచింది. అయితే కాన్సెప్ట్ క‌న్ఫ్యూజ‌న్‌గా ఉండటంతో వెప‌న్‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవలే కోలీవుడ్ నటుడు సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా వెపన్. కాగా, ఈ మూవీని గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. ఇకపోతే వెపన్ మూవీ జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. అయితే కాన్సెప్ట్ క‌న్ఫ్యూజ‌న్‌గా ఉండటంతో వెప‌న్‌ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవడంలో విఫలమైంది. దీంతో ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అయితే వెపన్ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా కొనుగోలు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ జూలై 26వ తేదీ నుంచి ఆహా తమిళ్ వెర్షన్ లో ఓటీటీలోని స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే తెలుగులో కూడా ఆహాలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోనే వెపన్ రిలీజ్ కానునన్నట్లు టాక్ వినిపిస్తోంది.కానీ, మరోపక్క తెలుగు వెర్ష‌న్ ఆగ‌స్ట్ ఫ‌స్ట్‌వీక్‌లో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు సమాచారం.

ఇక వెపన్ కథమేమిటంటే..  అగ్ని (వ‌సంత్ ర‌వి)  అనే యూట్యూబర్ ను.. తేని డిస్ట్రిక్‌లో బాంబు బ్లాస్ట్స్‌ జరగడంతో అందుకు కారణం ఈ యువకుడే అనే అనుమానంతో పోలీసులు ఇతనిని అరెస్ట్ చేస్తారు. కానీ, అగ్ని మాత్రం ప్ర‌పంచానికి తెలియ‌ని సూప‌ర్ హీరో మిత్ర‌న్‌ గురించి తాను వెతుకుతున్నాన‌ని, త‌న‌కు ఈ బ్లాస్ట్‌ల‌తో సంబంధం లేద‌ని పోలీసుల‌కు చెబుతాడు. అయితే ఈ సినిమలో సూప‌ర్ హీరో మిత్ర‌న్‌కు అగ్నికి ఉన్న సంబంధం ఏమిటి? అత‌డి కోసం అగ్నితో పాటు బ్లాక్ సొసైటీ 19 అనే స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ టీమ్ ఎందుకోసం వెతుకుతున్నారు? ఆ సూప‌ర్ హీరో మంచివాడా? చెడ్డ‌వాడా? నాజీ సైన్యం క‌నిపెట్టిన ఓ సీర‌మ్ ఇండియాలోకి ఎలా వ‌చ్చింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌. మరీ, ఈ విషయాలన్ని తెలియాలంటే కచ్చితంగా వెపన్ మూవీ ఓటీటీలో చూసేయాల్సిందే. మరి, త్వరలోనే ఓటీటీలో వెపన్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio