iDreamPost
android-app
ios-app

Rasavathi OTT: అర్జున్ దాస్ రొ*మాంటిక్ థ్రిల్లర్ రసవతి.. OTT స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

  • Published Jun 19, 2024 | 8:47 AMUpdated Jun 19, 2024 | 8:47 AM

ఓటీటీ లోకి మరొక కొత్త సినిమా వచ్చేస్తుంది. కాబట్టి ప్రేక్షకులంతా మరో మంచి ఇంట్రెస్టింగ్ కథను చూడడానికి రెడీ అయిపోవాల్సిందే. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లోకి మరొక కొత్త సినిమా వచ్చేస్తుంది. కాబట్టి ప్రేక్షకులంతా మరో మంచి ఇంట్రెస్టింగ్ కథను చూడడానికి రెడీ అయిపోవాల్సిందే. మరి ఆ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Jun 19, 2024 | 8:47 AMUpdated Jun 19, 2024 | 8:47 AM
Rasavathi OTT: అర్జున్ దాస్  రొ*మాంటిక్ థ్రిల్లర్ రసవతి.. OTT స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

ఏదైనా కొత్త సినిమా ఓటీటీ లోకి అడుగుపెడుతుందంటే చాలు… ఆ సినిమా ఏంటా ఎప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ మరెవరో కాదు.. తమిళ నటుడు అర్జున్ దాస్. అర్జున్ దాస్ ఎక్కువగా నెగిటివ్ రోల్స్ లోనే నటించాడు. ముఖ్యంగా ఇతని వాయిస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో అర్జున్ దాస్ నటించిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఖైదీ, మాస్టర్ సినిమాలలో అర్జున్ దాస్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత విక్రమ్ సినిమాలోనూ అర్జున్ స్పెషల్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలే కాకుండా తెలుగులోనూ ఆక్సిజన్, బుట్టబొమ్మ సినిమాలలోనూ అర్జున్ నటించారు. ఇక ప్రస్తుతం అర్జున్ ఓజి సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో అర్జున్ మెయిన్ లీడ్ లో నటించిన తమిళ సినిమా రసవతి. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా మే 10 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు కూడా రెడీ అయిపోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ తమిళ్ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జూన్21 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాబట్టి ఈ వీకెండ్ చూడడానికి మరో సినిమా రెడీ అయిపోయింది.

అయితే ఈ సినిమాను తెలుగులో కూడా ఇప్పుడే డబ్బింగ్ చేస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలాగూ ఓటీటీ లకు ఆదరణ బాగానే పెరుగుతుంది కాబట్టి.. తెలుగులో కి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమాలో అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు. వారితో పాటు ష్మ వెంకటేశ్, సుజీత్ శంకర్, జీఎం సుందర్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియం ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటీటీ లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి