iDreamPost
android-app
ios-app

OTT Movie: హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న ఇండియన్ మోస్ట్ వైలెంట్ మూవీ.. OTT పార్ట్నర్ ఫిక్స్

  • Published Jul 02, 2024 | 5:47 PM Updated Updated Jul 02, 2024 | 5:47 PM

Upcoming OTT Action Thriller : ఇంకా థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవ్వని సినిమాలకు కూడా ముందే ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు కూడా ఓటీటీ డీల్ ముగిసిందట.. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

Upcoming OTT Action Thriller : ఇంకా థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవ్వని సినిమాలకు కూడా ముందే ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు కూడా ఓటీటీ డీల్ ముగిసిందట.. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jul 02, 2024 | 5:47 PMUpdated Jul 02, 2024 | 5:47 PM
OTT Movie: హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న ఇండియన్  మోస్ట్ వైలెంట్ మూవీ.. OTT పార్ట్నర్ ఫిక్స్

హర్రర్ , యాక్షన్ , సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్.. ఈ జోనర్స్ అన్నిటికి కూడా హాలీవుడ్ సినిమాలు పెట్టింది పేరు. ఈ క్రమంలో మరో ఇండియన్ మూవీ.. హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. కొన్ని నెలల వరకు వైలెంట్ సినిమాలంటే కొన్ని స్పెషల్ సినిమాల పేర్లు చెప్పేవారు. ఇలాంటి సినిమాలను చూడడానికి కొంతమంది భయపడినా కానీ .. కొంతమంది మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు చూడని.. మోస్ట్ వైలెంట్ సినిమాను హాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఈ సినిమా పేరు కిల్. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుండగా.. అప్పుడే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయిందట. మరి ఈ సినిమాను సంబంధించిన మరిన్ని విషయాలు చూసేద్దాం.

ఇండియాలో ఇప్పటివరకు ఎప్పుడు, ఎవ్వరు చూడని.. మోస్ట్ వైలెంట్ మూవీ అని చెప్తూ.. కిల్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా జులై 5 న థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాను ఇంగ్లీష్ ఓ కూడా రీమేక్ చేయనున్నట్లు తెలియజేశారు మేకర్స్. ఈ సినిమాను కరణ్ జోహార్ తోపాటు గునీత్ మోంగా, అపూర్వ మెహతా లాంటి స్టార్స్ నిర్మించగా.. నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఒక్క ట్రైలర్ చూస్తూనే అర్థమైపోతుంది.. మూవీ మొత్తం మీద ఎంత వైలెన్స్ ఉండబోతుంది అని.. ఈ క్రమంలో అప్పడే ఈ సినిమా హక్కులకు డీసెంట్ ధరలకు అమ్ముడుపోయాయట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా కానీ.. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. ఓటీటీ లోకి వస్తుంది. ఇక ఈ సినిమాలో లక్ష్య, రాఘవ్ జుయెల్, ఆశిష్ విద్యార్థి, హర్ష్ చాయా, తాన్యా మణిక్‌తలా, అభిషేక్ చౌహాన్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే ఇప్పటి వరకూ చూడని అత్యంత హింసాత్మక సినిమా అని మేకర్స్ చెప్పడంతో.. ఈ సినిమాపై అందరికి మరింత ఆసక్తి పెరిగింది. ఇక ట్రైలర్ ను గమనిస్తే .. ఓ జంట ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఈలోపే ఓ దొంగల ముఠా ట్రైన్ లోకి వచ్చి.. భీభత్సం చేస్తారు. ఈ క్రమంలో ఆ జంట సెపరేట్ అయిపోతారు. దీనితో హీరో బాగా వైలెంట్ అయిపోతాడు. ఆ దొంగలను క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఎం జరిగింది అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమా థియేటర్స్ లో , ఓటీటీ లో ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş