iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTT లోకి యాక్షన్ డ్రామా మూవీ ‘భీమా’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Sep 06, 2024 | 6:00 PM Updated Updated Sep 06, 2024 | 6:00 PM

OTT Action Thriller Movie- Bheema : ఓటీటీ లోకి కొన్ని సినిమాలు సైలెంట్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

OTT Action Thriller Movie- Bheema : ఓటీటీ లోకి కొన్ని సినిమాలు సైలెంట్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

  • Published Sep 06, 2024 | 6:00 PMUpdated Sep 06, 2024 | 6:00 PM
సైలెంట్ గా OTT లోకి యాక్షన్ డ్రామా మూవీ ‘భీమా’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీ లో చాలా వరకు తెలుగు సినిమాలే ఉన్నాయి. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలే కాకుండా.. డైరెక్ట్ గా కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. ఇక అలాంటి సినిమాలు ఊహించని విధంగా ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి మూవీ లవర్స్ కు ఈ వారం ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగినట్లే. మరి ఈ సినిమా ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

ఈ సినిమా మరేదో కాదు.. దునియా విజయ్ హీరోగా నటించిన కనడ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. భీమా. కేవలం ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 25 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి .. నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది. ఈ ఏడాది.. మొదటి రోజే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా భీమా రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ 10 కోట్ల వ‌ర‌కు ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. కాగా ఈ సినిమాకు .. దునియా విజ‌య్ స్వ‌యంగా దర్శకత్వం వహించడం విశేషం. ఆగష్టు 9 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా .. నెల లోపే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి రావడంతో ప్రేక్షకులు సర్ప్రైజ్ అవుతున్నారు. శుక్రవారం నుంచి ఈ మూవీ ప్రముఖ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. దునియా విజయ్ ఈ సినిమాలో ఓ గ్యాంగ్ స్టార్.. అతను ఉన్నట్లుండి తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన కారణంగా క్రైమ్ వరల్డ్ కు దూరమౌతాడు. అంత పెద్ద గ్యాంగ్ స్టార్ అయినా కూడా.. ఒక మెకానిక్ షాప్ పెట్టుకుని నార్మల్ లైఫ్ సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్ని కారణాల వలన అతను డ్రగ్స్ మాఫియాతో భీమా పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ గ్యాంగ్ లోని.. బ్లాక్ డ్రాగ‌న్ మంజా అనే రౌడీతో.. భీమా ఎలాంటి పోరాటం చేసాడు ? అసలు అతను గ్యాంగ్ స్టార్ గా ఎలా మారాడు ? అతని పాస్ట్ ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ వీకెండ్ ఓ మంచి మాస్ యాక్షన్ మూవీ చూడాలంటే మాత్రం ఈ మూవీ బెస్ట్ ఛాయస్. మరి ఈ సినిమాపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet