iDreamPost
android-app
ios-app

Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ OTT స్ట్రీమింగ్ అప్పుడే.. కానీ, ప్లాట్ ఫార్మ్ మాత్రం..

  • Published May 11, 2024 | 12:25 PM Updated Updated May 11, 2024 | 12:25 PM

ఈ మధ్య కాలంలో సినిమాలు ఇలా థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లరి నరేష్ నటించిన సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ గురించి బజ్ నడుస్తుంది. అదేంటో చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో సినిమాలు ఇలా థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో అలా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అల్లరి నరేష్ నటించిన సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ గురించి బజ్ నడుస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published May 11, 2024 | 12:25 PMUpdated May 11, 2024 | 12:25 PM
Aa Okkati Adakku OTT: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ OTT స్ట్రీమింగ్ అప్పుడే.. కానీ, ప్లాట్ ఫార్మ్ మాత్రం..

ఎంత థియేటర్ లో సినిమాలు చూసిన కానీ.. ఆయా సినిమాలు ఎప్పుడెప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లోకి వస్తాయా అని ఎదురుచూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇలా ఏదైనా సినిమా థియేటర్ కు వచ్చిందో లేదో అలా వాటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజులలోపే ఆయా సినిమాలు ఓటీటి లో దర్శనం ఇస్తున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా అల్లరి నరేష్ నటించిన సినిమా “ఆ ఒక్కటి అడక్కు”. ఈ సినిమా మే 3 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇంతలోనే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపించేస్తుంది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఏ ప్లాట్ ఫార్మ్ దక్కించుకుందో .. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం.

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా “ఆ ఒక్కటి అడక్కు”. ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినపుడు.. అల్లరి నరేష్ కామెడీకి మంచి కమ్ బ్యాక్ లాంటి సినిమా అని అంతా భావించారు. అయితే , కారణాలు ఏమై ఉంటాయో తెలీదు కానీ .. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఏదేమైనా సెకండ్ ఇన్నింగ్స్ లో కొన్ని సీరియస్ అంశాలతో ముందుకు వచ్చిన అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత కామెడీ జోనర్ తో ముందుకు వచ్చారు. మిక్స్డ్ టాక్ సంగతి ఎలా ఉన్నా.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డీసెంట్ కలెక్షన్స్ నే రాబడుతుంది. ఇక ఈ మూవీ ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోక ముందే ఓటీటీ ఎంట్రీ టాక్ వినిపిస్తోంది. పైగా ఒకేసారి రెండు ఓటీటీ లలో రానున్నట్లు సమాచారం.

Aa Okkati Adakku

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు… ఆహా కూడా దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా మే 31 నుంచి ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నెలాఖరు లోగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ రిలీజ్ అవుతుందా లేదా ఒకే ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… మ్యాట్రిమోనీ సంస్థలను నమ్ముకుంటున్న యువత ఎలాంటి మోసాలకు గురి అవుతున్నారు.. అనే అంశానికి కామెడీ కోణాన్ని జోడించి చూపించారు.. పూర్తి కథ తెలుసుకోవాలంటే ఈ సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingjojobetjojobet girişjojobet girişjojobet girişcasibom