iDreamPost
android-app
ios-app

రావు రమేష్ ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  • Published Sep 13, 2024 | 8:34 PM Updated Updated Sep 13, 2024 | 8:34 PM

Maruthi Nagar Subramanyam: ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో అడుగు పెడుతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను ఆహా ప్రకటించింది.

Maruthi Nagar Subramanyam: ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో అడుగు పెడుతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను ఆహా ప్రకటించింది.

  • Published Sep 13, 2024 | 8:34 PMUpdated Sep 13, 2024 | 8:34 PM
రావు రమేష్ ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ.. OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ప్రస్తుతం ఓటీటీ హవా బాగా నడుస్తోంది.  అన్ని భాషల్లోని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయిపెద్ద సినిమాలు మొదలుకుని, చిన్న సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమాలు సైతం వ్యూస్ సాధిస్తున్నాయి.  థియేటర్లో విడుదలైన అన్ని సినిమాలు కొంతకాలం తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్  లోకి వచ్చేస్తున్నాయి.  వాటిలో ఒకటి రావు రమేష్ నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఆహా ను కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఈ మూవీ ఓటీటీ లోకే వచ్చే డేట్ ను ఆహా ప్రకటించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీనగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాను లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. ఈ మూవీ థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో అడుగు పెడుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం సెప్టెంబర్ 13న ఆహా వీడియో వెల్లడించింది. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామాను సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా  వీడియో అధికారికంగా ప్రకటించింది. తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతలో పోస్ట్ చేసింది. మీకు కావాల్సిన నవ్వుల థెరపీ వారి దగ్గర ఉందని, ఈ ఏడాది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్.. మారుతీనగర్ సుబ్రమణ్యం ఆహాలో 20వ తేదీన ప్రీమియర్ కానుందనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రకటించింది.

రావు రమేష్ నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి షో నుంచి కూడా.. ఓ మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామాగా ప్రశంసలు అందుకుంది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు వసూళ్లు చేసింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆహా  సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రావు రమేష్  గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో ఇల్లు గడవడం కోసం అతని భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అతని కొడుకు అర్జున్ కూడా చదువు పూర్తి చేసుకుని జాబ్ లేక ఖాళీగా ఉంటాడు. ఈ క్రమంలో అతను కాంచన అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అలా కష్టాలతో సాగిపోతున్న వారి జీవితం సాగిపోతుంది. ఈ క్రమంలోనే సడెన్ గా ఓ రోజు.. రావు రమేష్ అకౌంట్ లోకి రూ.10లక్షలు క్రెడిట్ అవుతాయి. వాటి అన్నిటిని కూడా తండ్రీకొడుకులు ఇద్దరు విచ్చల విడిగా ఖర్చు పెట్టేసుకుంటారు. ఆ తరువాత వారు చిక్కుల్లో పడతారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు క్రెడిట్ చేశారు ? వారు ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యారు ? ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డరా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో ఈ సినిమాను చూసి ఫుల్ గా నవ్వుకోవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet