Tillu Square OTT: అఫీషియ‌ల్: టిల్లు స్క్వేర్ OTT రిలీజ్ డేట్ ఫిక్స్! డేట్ సేవ్ చేసి పెట్టుకోండి!

ఓటీటీ లోకి ప్రతి వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నా కానీ.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే సినిమాలు కొన్ని ఉంటాయి. అటువంటి సినిమాలల్లో ఒకటి టిల్లు స్క్వేర్. ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

ఓటీటీ లోకి ప్రతి వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నా కానీ.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూసే సినిమాలు కొన్ని ఉంటాయి. అటువంటి సినిమాలల్లో ఒకటి టిల్లు స్క్వేర్. ఈ సినిమా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ వారం ఓటీటీ లలో రిలీజ్ కాబోయే సినిమాలేంటో ఆల్రెడీ చూసేసి ఉంటాం. దానికి తగినట్లు ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమా చూడాలి అని కూడా అందరు ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే, ఈ వారం రిలీజ్ అయినవి చూడాలనుకుంటే వెంటనే అన్నిటిని చూసేయండి. ఎందుకంటే వచ్చే వారం.. ఇన్ని రోజులు థియేటర్స్ ని ఒక ఊపు ఊపేసిన సినిమా ఒకటి ఓటీటీ లో అడుగుపెట్టబోతుంది, అందులోను తెలుగు సినిమా.. ఓటీటీ లలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా.. మూవీ లవర్స్ మాత్రం కొన్ని సినిమాల కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సినిమాలలో ఒకటి సిద్ధూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా. అనుకున్నట్లుగానే అదే తేదికి ఓటీటీ లో అడుగుపెట్టబోతున్నట్లు.. ఈ సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో ఏ తేదీన విడుదల కాబోతుందో చూసేద్దాం.

డీజే టిల్లు.. సినిమాతో ఒక బ్రాండ్ గా మారిపోయిన ఈ పేరు.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో ఇంకాస్త విలువ పెంచేసుకుంది. ఎందుకంటే మార్చి 29 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 2024 లో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో.. అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా టిల్లు స్క్వేర్ రికార్డు సృష్టించింది. డీజే టిల్లు కు టిల్లు స్క్వేర్ కు దర్శకుడు మారినా కానీ.. ఎక్కడ కూడా ఆ ఫీల్ రాకుండా అదే రేంజ్ లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ సినిమాకు మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా న‌టిస్తూ క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించాడు. థియేటర్స్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే.. టిల్లు స్క్వేర్ సినిమా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో.. ఏప్రిల్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు.. అధికారికంగా ప్రకటించింది.

“హిస్ట‌రీ రిపీట్ అవ్వ‌డం నార్మ‌ల్‌. అదే టిల్లు వ‌స్తే హిస్ట‌రీ, మిస్ట‌రీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్‌ అవుతాయ్‌. అట్లుంట‌ది టిల్లుతోని”.. అంటూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఇక టిల్లు స్క్వేర్ సినిమా కథ విషయానికొస్తే.. డీజే టిల్లు మూవీ లో రాధికా అక్క చేసిన రచ్చను మర్చిపోయి.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేద్దాం అనుకున్న హీరో కు అనుకోకుండా అనుపమ పరిచయం అవుతుంది. ఆమెతో హీరో ఫస్ట్ లుక్ లోనే ప్రేమలో పడతాడు. కానీ ఒక్కరోజు లోనే వారికి బ్రేక్ అప్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత అనుపమ కనిపించకుండా పోతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనుపమ కనిపించి ఆమె ప్రెగ్నెంట్ అని దానికి హీరోనే కారణమని చెబుతుంది.
ఆమె చెప్పింది నిజమేనా ! అసలు కొద్దీ రోజులు కనిపించకుండా ఉండడానికి కారణం ఏంటి ! అసలు మొదటి పార్ట్ కు ఈ పార్ట్ కు లింక్ ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో వచ్చే ట్వీస్ట్ అందరికి ఆశ్చర్యపరుస్తుంది. మరి, టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments