iDreamPost
android-app
ios-app

OTT Suggestion: OTTలో భార్యలు తారుమారు అయ్యే కాన్సెప్ట్.. చివరి వరకూ కదలనివ్వని మూవీ!

  • Published May 01, 2024 | 7:16 PM Updated Updated May 01, 2024 | 7:16 PM

ఓటీటీ లోకి ఎన్నో సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలకు, సిరీస్ లకు మాత్రం ప్రత్యేక ఆదరణ లభించేస్తుంది. అలియా భట్ సైతం రివ్యూ ఇచ్చిన ఈ సినిమాను మీరు చూశారా..

ఓటీటీ లోకి ఎన్నో సిరీస్ లు , సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలకు, సిరీస్ లకు మాత్రం ప్రత్యేక ఆదరణ లభించేస్తుంది. అలియా భట్ సైతం రివ్యూ ఇచ్చిన ఈ సినిమాను మీరు చూశారా..

  • Published May 01, 2024 | 7:16 PMUpdated May 01, 2024 | 7:16 PM
OTT Suggestion: OTTలో భార్యలు తారుమారు అయ్యే కాన్సెప్ట్.. చివరి వరకూ కదలనివ్వని మూవీ!

సినిమాలు, సిరీస్ లు అంటే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ. పెద్ద పెద్ద సినిమాలకు విపరీతమైన బజ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎలాగూ చూస్తూనే ఉంటారు. కానీ కొన్ని చిన్న చిన్న సినిమాలను మాత్రం మిస్ చేసేస్తూ ఉంటారు,కానీ ఆ సినిమాలే బాలీవుడ్ స్టార్స్ ను సైతం మెప్పిస్తాయని ఊహించరు. గత వారం రిలీజ్ అయినా సినిమాలలో అలాంటి ఓ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం ఓ మంచి సినిమాను మిస్ చేసినట్లే. ఎందుకంటే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం ప్రశంసలు కురిపించింది. మరి ఇంతకీ అందరిని మెప్పిస్తున్న ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆ సినిమా మరేదో కాదు లాపతా లేడీస్ సినిమా. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 1 న థియేటర్ లో రిలేజ్ అయ్యి విమర్శకుల సైతం నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. కేవలం రూ.4కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ.20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాయి. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 26 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ లో కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఈ మూవీపై స్పందించారు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఎంత మందిని మెప్పించిందో. మరి ఇప్పటివరకు మీరు కనుక ఈ సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. కచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది ఈ సినిమా.

అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి.. ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. 2001లో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో లాపతా లేడీస్ కథ కొనసాగుతుంది. ఈ సినిమా కథేంటంటే.. కొత్తగా పెళ్ళైన రెండు జంటల్లో.. ఒకరి భార్య వేరే ఒకరికి మారిపోతారు. ఈ కథ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా.. దీపక్ కుమార్ , పూల కు వివాహం జరుగుతుంది. ఊరికి వెళ్లేందుకు వారు ఓ ట్రైన్ ను ఎక్కుతారు. అయితే అదే ట్రైన్ లో మరొక జంట పూల్ ధరించిన దుస్తులలానే ధరించి ఉంటుంది. వారిద్దరు కూడా పై ముసుగులు ధరించి ఉంటారు. ఈ క్రమంలో రైలు దిగే ముందు తొందరలో ఒకరి భార్యను మరొకరు తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş