Swetha
హర్రర్ సినిమాలను అందరు భయంతో చూసినా కానీ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు చూసిన హర్రర్ మూవీస్ అన్ని ఒక ఎత్తైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా ఒక ఎత్తు. ఒకవేళ ఈ సినిమాను కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.
హర్రర్ సినిమాలను అందరు భయంతో చూసినా కానీ ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు చూసిన హర్రర్ మూవీస్ అన్ని ఒక ఎత్తైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే హర్రర్ సినిమా ఒక ఎత్తు. ఒకవేళ ఈ సినిమాను కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.
Swetha
హర్రర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు అందరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక హర్రర్ సినిమా వస్తుంది అంటే ఎంత భయం వేసినా కానీ.. ఒంటరిగా కూర్చుని చూసే సాహసాలు చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు తగిన సినిమాలను ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక హర్రర్ కంటెంట్ జోనర్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరొక లెవెల్. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని వారాల పాటు మైండ్ లో తిరుగుతూ ఉండడం పక్కా అని చెప్పి తీరాల్సిందే. లాంగ్వేజ్ ని పక్కన పెట్టేస్తే .. ఈ సినిమాలో ఉండే హర్రర్ కు గుండెల్లో దడ పుట్టాల్సిందే. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ చూడాలి అనే విషయాల గురించి చూసేద్దాం.
తెలుగులో అప్పట్లో ఆమ్మో బొమ్మ సినిమా చూసి మంచి హర్రర్ ఫీల్ పొందేవాళ్ళు ప్రేక్షకులు. ఇక ఆ తర్వాత లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి. అన్నబెల్లె సినిమా కూడా చాలా మంది చూసే ఉంటారు. ఈ సినిమా వాటి అన్నిటికి మించి ఉంటుందని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమా పేరు సబ్రీనా.. ఇది 2018 లో విడుదదలైన ఒక ఇండోనేషియన్ హర్రర్ సినిమా. ఈ సినిమాను చూడాలంటే చాలా ధైర్యం కావలి. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇంతకుమించిన కంటెంట్ మరెక్కడ దొరకదు. ఈ సినిమా తెలుగులో లేకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ అందించే విషయంలో మాత్రం.. ఎక్కడా లోటు చేయదు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వేనని చూసేయండి.
అసలు ఈ సినిమాను ఎందుకు చూడాలి అంత హర్రర్ కంటెంట్ ఎం ఉంటుంది ఈ సినిమాలో అనే విషయానికొస్తే.. ఈ సినిమాలో ఓ దెయ్యం ఆత్మ ఒక బొమ్మలోకి ఎలా ప్రవేశించింది ఆ తర్వాత ఎం జరిగింది అనే కాన్సెప్ట్ తో ఉంటుంది వ్యాన్యా అనే పాపా తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు చనిపోతారు. ఆ తర్వాత ఓ బొమ్మల ఫ్యాక్టరీ ఓనర్ ఈ పాపా ను దత్తత తీసుకుంటారు. ఆ ఫ్యాక్టరీలో సబ్రీనా అనే బొమ్మలు చాలా ఫేమస్. ఈ క్రమంలో ఒకరోజు వ్యాన్యా పుట్టిన రోజు సంధర్బంగా.. ఆ బొమ్మను ఆమెకు ప్రెసెంట్ చేస్తారు, కానీ వ్యాన్యా మాత్రం తన తల్లిని మిస్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ రోజు స్కూల్ లో తన ఫ్రెండ్ దగ్గర.. చార్లీ చార్లీ అనే ఓ ఆటను నేర్చుకుంటుంది. అంటే ఆ ఆట ద్వారా ఆత్మలను భూమి మీదకు ఆహ్వానించి.. వాటితో మాట్లాడడం. మళ్ళీ తిరిగి వెళ్లాలంటే కచ్చితంగా ప్రార్థన చేసి, ఆత్మల ప్రపంచానికి మళ్లీ పంపించాలని కూడా తన ఫ్రెండ్ చెబుతాడు.
దీనితో ఆమె ఆ రాత్రి ఆ ఆట ద్వారా తన తల్లిని ఆహ్వానిస్తుంది. కానీ ఆమె తల్లి ఆత్మ కనిపించదు. ఇక ఆమె తన దగ్గర ఉన్న బొమ్మను పట్టుకుని నిద్రపోతుంది. కానీ, ఉన్నట్టుండి ఆ బొమ్మ కళ్ళు కదలడం మొదలవుతాయి. ఇక వచ్చింది ఆమె తల్లే అనుకుని ఆ బొమ్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంతలో మరొక ఆత్మ ఆ పాపను వేధిస్తుంది. దీనితో ఆమె భయపడుతుంది. ఇలా ఇక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. అసలు ఆ ఆట ఆడినపుడు రెండు ఆత్మలు ఎలా వచ్చాయి ! ఆ పాప తల్లిదండ్రులను చంపింది ఎవరు ! ఆ రెండో ఆత్మ ఎవరిదీ ! తిరిగి ఆ ఆత్మలను వాటి లోకాలకు ఎలా పంపించారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.