Dharani
సంక్రాంతి సందర్బంగా విడుదలైన నా సామి రంగా సినిమా మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే ఈ సినిమాలో ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. ఆ వివరాలు..
సంక్రాంతి సందర్బంగా విడుదలైన నా సామి రంగా సినిమా మంచి విజయం సాధించింది. ఇక త్వరలోనే ఈ సినిమాలో ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. ఆ వివరాలు..
Dharani
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు అనగా.. జనవరి 14న ఈ సినిమా విడుదలయ్యింది. పండుగ వేళ ఆఖర్లో వచ్చిన సినిమా ఇదే. నా సామిరంగా కన్నా ముందు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. అప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. అలాంటి సమయంలో మలయాళ రీమేక్‌తో వచ్చి.. నాగార్జున హిట్టు కొడతాడా అని అందరూ అనుమానించారు.
అయితే అనూహ్య రీతిలో.. బాక్లాఫీస్ వద్ద జెండా పాతింది నా సామిరంగా సినిమా. మొదటి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. హిట్టు టాక్‌తో దూసుకుపోవడమే కాక సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో హనుమాన్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా నా సామిరంగా నిలిచింది. తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే నా సామిరంగా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. జనవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుందట. విడుదలైన నెల రోజుల తర్వాత అనగా.. ఫిబ్రవరి 15న నా సామిరంగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
నా సామిరంగ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. భారీ మొత్తానికి నా సామిరంగా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర నా సామిరంగ మూవీ రన్ దాదాపు ముగిసింది. అందుకే త్వరలోనే దీన్ని ఓటీటీలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు.
తాజాగా నా సామిరంగ మూవీ సక్సెస్ మీట్‌ను హైదర్‌బాద్‌లో నిర్వహించారు. చిత్రబృందం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నా సామిరంగ సినిమా చేస్తున్నానంటే చాలా మంది నవ్వారని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ మొదలు పెట్టి సంక్రాంతికి ఎలా విడుదల చేస్తారని చాలా మంది తనను ప్రశ్నించారని ఆయన చెప్పుకొచ్చారు.
పైగా తన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్నారు నాగార్జున. ఎవరేమనుకున్నా సరే.. తాము మాత్రం కేవలం మూడు నెలల వ్యవధిలోనే నా సామిరంగా సినిమాను పూర్తి చేసి.. విడుదల చేశామని చెప్పుకొచ్చారు. తమ నమ్మకం నిజమయ్యి.. సినిమా మంచి విజయం సాధించిందని.. అందుకే సక్సెస్ మీట్ నిర్వహించామని చెప్పుకొచ్చారు నాగార్జున.