iDreamPost
android-app
ios-app

ఆ కారణంతో ‘మంత్‌ ఆఫ్‌ మధు’ ఓటీటీ రిలీజ్‌ వాయిదా..

  • Published Nov 03, 2023 | 10:20 AM Updated Updated Nov 03, 2023 | 10:20 AM

ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌.. మంత్‌ ఆఫ్‌ మధును ఈ రాత్రికి మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము.

ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌.. మంత్‌ ఆఫ్‌ మధును ఈ రాత్రికి మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము.

  • Published Nov 03, 2023 | 10:20 AMUpdated Nov 03, 2023 | 10:20 AM
ఆ కారణంతో ‘మంత్‌ ఆఫ్‌ మధు’ ఓటీటీ రిలీజ్‌ వాయిదా..

నవీన్‌ చంద్ర, స్వాతీ రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మంత్‌ ఆఫ్‌ మధు. అక్టోబర్‌ 6, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం మంత్‌ ఆఫ్‌ మధుకు మంచి రేటింగ్‌ ఇచ్చారు. ఇక, ఈ సినిమాకు సంబంధించి తాజాగా, ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫామ్‌ అయింది. నవంబర్‌ 3వ తేదీ అంటే ఈ రోజు ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవ్వాల్సి ఉండింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల స్ట్రీమింగ్‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆహా టీం తమ సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘‘ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌.. మంత్‌ ఆఫ్‌ మధును ఈ రాత్రికి మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము. మాకు టెక్నికల్‌ సమస్యలు తలెత్తాయి. మంచి అనుభూతి ఇచ్చేలా సినిమాను మీ మందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము. అతి త్వరలో దీనిపై అప్‌డేట్‌ ఇస్తాము. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి’’ అని పేర్కొంది. ఈ రోజు సినిమాను చూద్దామనుకున్న వారు నిరాశలో మునిగిపోయారు.

మంత్‌ ఆఫ్‌ మధు స్ట్రీమింగ్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆహా టీం కూడా సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి చూస్తోంది. కాగా, ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమాకు శ్రీకాంత్‌ నాగోతీ దర్శకత్వం వహించారు. యశ్వంత్‌ మూలుకుట్ట నిర్మాతగా వ్యవహరించారు. అచ్చు రాజామణి సంగీతం అందించారు. మరి, మంత్‌ ఆఫ్‌ మధు ఓటీటీ స్ట్రీమింగ్‌ పోస్ట్‌ పోన్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş