iDreamPost
android-app
ios-app

సైలెంట్ గా OTTలోకి వచ్చేసిన మమ్ముట్టి సీరియల్ కిల్లర్ మూవీ!

  • Published Feb 09, 2024 | 3:44 PM Updated Updated Feb 09, 2024 | 3:44 PM

Mammotty Suspense Thriller Movie: జయరాం, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ వివరాలు తెలుసుకోండి.

Mammotty Suspense Thriller Movie: జయరాం, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ వివరాలు తెలుసుకోండి.

  • Published Feb 09, 2024 | 3:44 PMUpdated Feb 09, 2024 | 3:44 PM
సైలెంట్ గా OTTలోకి వచ్చేసిన మమ్ముట్టి సీరియల్ కిల్లర్ మూవీ!

ప్రస్తుతం సినిమా లవర్స్ అంతా థియేటర్లో వచ్చే సినిమాల కంటే కూడా ఓటీటీలో వచ్చే మూవీస్ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అన్ని భాషల చిత్రాలు థియేటర్లో రన్ పూర్తి చేసుకోగానే సాధ్యమైనంత త్వరగా ఓటీటీల్లోకి వచేస్తుంటాయి. కొన్ని బాగా హడావుడి చేసి వస్తే.. మరికొన్ని మాత్రం సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాగే మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి నటించి ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? అసలు ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది? అనే పూర్తి వివరాలు చూడండి..

మమ్ముట్టి ఎంచుకునే కథలు ఎంతో కొత్తగా ఉంటాయి. కొన్ని యాక్షన్ తో మెప్పిస్తూ ఉంటే.. మరికొన్ని మాత్రం బలమైన కథనంతో నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మమ్ముట్టి నెగిటివ్ రోల్ లో నటించిన ఓజ్లర్ అబ్రహాం అనే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. దీనిని ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ మూవీలో జయరాం హీరోగా నటిస్తే.. మమ్ముట్టి సీరియల్ కిల్లర్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఏకంగా రూ.37 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు జయరాం నటించిన రెండు చిత్రాలు ఒకేరోజు ఓటీటీలోకి వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం స్ట్రీమింగ్ అవుతుండగా.. అమెజాన్ లో ఓజ్లర్ అబ్రహామ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా డబుల్ ధమాకా అందుకున్నాడు.

అసలు కథ ఏంటంటే?:

అబ్రహం ఓజ్లర్(జయరాం) జీవితం నేపథ్యంలో ఈ సినిమా జరుగుతూ ఉంటుంది. అబ్రహం భార్యాపిల్లలు కనిపించకుండా పోతారు. వాళ్లు లేకపోయినా ఉన్నట్లుగానే అబ్రహం ఓజ్లర్ ఊహించుకుంటూ ఉంటాడు. మరోవైపు కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. భిన్నమైన నేపథ్యం కలిగిన కొందరు వ్యక్తులు వరుసగా హత్యకు గురవుతూ ఉంటారు. అయితే ఆ హత్యలు జరిగిన ప్రదేశాల్లో హ్యాపీ బర్త్ డే అని రక్తంతో రాసి ఉంటుంది. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? అసలు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది జయరాం కనుక్కో గలిగాడా? అలెక్స్(మమ్ముట్టి) అసలు సీరియల్ కిల్లర్ ఎందుకు అయ్యాడు? అతని ప్రియురాలి మరణానికి కారణం ఎవరు? వారిపై పగ తీర్చుకున్నాడా? అన్నదే కథ. ఈ మూవీని మిధున్ థామస్ ఎంతో ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా మమ్ముట్టి, జయరాం నటన అందరినీ మెప్పిస్తుంది. మరి.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అబ్రహాం ఓజ్లర్ మూవీ మీరు చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetparkgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom