iDreamPost
android-app
ios-app

OTTలోకి పొలిమేర 2.. ఎప్పుడు? ఎక్కడంటే..

  • Published Nov 06, 2023 | 1:52 PM Updated Updated Nov 06, 2023 | 1:52 PM

మూడవ రోజు కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇక, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది...

మూడవ రోజు కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇక, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది...

  • Published Nov 06, 2023 | 1:52 PMUpdated Nov 06, 2023 | 1:52 PM
OTTలోకి పొలిమేర 2.. ఎప్పుడు? ఎక్కడంటే..

సస్పెన్స్‌, హర్రర్‌ థిల్లర్‌ సినిమా ‘ మా ఊరి పొలిమేర 2’ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సునామీ వసూళ్లను సాధిస్తోంది. రెండు రోజుల్లోనే దాదాపు 7 కోట్ల రూపాయల్ని కొల్లగొట్టింది. సినిమాకు నైజాం ఏరియాలో ఊహించని స్పందన లభిస్తోంది. ఇక్కడ రెండు రోజుల్లో దాదాపు రెండు కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

మూడవ రోజు కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇక, ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మా ఊరి పొలిమేర 2 నవంబర్‌ చివరి వారంలో ఓటీటీలోకి రానుందట. అది కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుందట. మా ఊరి పొలిమేర మొదటి భాగం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లోనే ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతోంది. రెండో భాగం కూడా అక్కడే స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మా ఊరి పొలిమేర థియేటర్లలో రిలీజ్‌ అవ్వలేదు. నేరుగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ మొదలైంది. మౌత్‌ పబ్లిసిటీ ద్వారా సినిమా పిచ్చ హైప్‌ వచ్చింది. ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదటి భాగానికి వచ్చిన ఆదరణ కారణంగా నిర్మాతలు ఈ సినిమా రెండో భాగమైన ‘ మా ఊరి పొలిమేర 2’ ను థియేటర్లలో రిలీజ్‌ చేశారు. ఇక్కడ కూడా సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక, ఈ సినిమాలో సత్యం రాజేష్‌, బాలాధిత​, రవి వర్మ, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీనులు కీలక పాత్రల్లో నటించారు. మరి, ‘ మా ఊరి పొలిమేర 2’ ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet