iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

  • Published Jan 11, 2024 | 7:15 PM Updated Updated Jan 11, 2024 | 7:15 PM

సినిమాను చూసే కోణం ఇప్పుడు పూర్తిగా మారింది. సినీ ప్రియులను థ్రిల్ ఫీలయ్యేలా చేసేందుకు క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ముందుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్ అలరించేందుకు వచ్చేసింది.

సినిమాను చూసే కోణం ఇప్పుడు పూర్తిగా మారింది. సినీ ప్రియులను థ్రిల్ ఫీలయ్యేలా చేసేందుకు క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ముందుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి క్రైమ్ థ్రిల్లర్ అలరించేందుకు వచ్చేసింది.

  • Published Jan 11, 2024 | 7:15 PMUpdated Jan 11, 2024 | 7:15 PM
OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఇప్పుడు ఓటీటీల్లో క్రైమ్ అండ్ సస్పెన్స్, హార్రర్ థ్రిల్లర్స్ సినిమాలు,వెబ్ సిరీస్‌లదే హవా. ఇంట్లోనే ఉంటూ.. పెద్ద పెద్ద టీవీ స్క్రీన్ చూస్తూ సస్పెన్స్, థ్రిల్ ఫీలవుతున్నారు ప్రేక్షకులు. ఓటీటీ సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఎంజాయి చేస్తున్నారు. ఈ ఫ్లాట్ ఫామ్స్ కోసమే స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆసక్తికరమైన కథ, కథనాలతో ఇలాంటి మూవీస్, సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల రూపంలో తెరకెక్కించ లేని వాటిని, వెబ్ సిరీస్ రూపంలో తీసుకు వస్తున్నారు. ఇటీవల దూత అనే వెబ్ సిరిస్ ప్రేక్షకులను అలరించిన సంగతి విదితమే. ఇప్పుడు మరో క్రైమ్ థ్రిల్లర్ కట్టిపడేసేందుకు సిద్ధమైంది.

బాలీవుడ్ విలక్షణ నటుడు, వెబ్ సిరీస్ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్, ప్యామిలీ మెన్‌ సీరిస్ లతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్ పేయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మరో సిరిస్ కిల్లర్ సూప్. హ్యపీ, వేదం వంటి సినిమాలతో తెలుగు వారికి ఆయన సుపరిచితమే. ఫ్యామిలీ మెన్ 2తో మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ఓటీటీలో వరుస పెట్టి సినిమాలు, సిరీస్‌లతో అలరిస్తున్నాడు మనోజ్. ఉడ్తా పంజాబ్, సోంచిరియా, ఇష్కియా, దేడ్ ఇష్కియా వంటి సినిమాలను తెరకెక్కించిన అభిషేక్ చౌబే దీనికి దర్శకుడు. కొంకణా సేన్ శర్మ, నాజర్, షాయాజీ షిండే, రాజీవ్ రవీంద్ర నాథన్, లాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక కిల్లర్ సూప్ ట్రైలర్స్ విడుదలై ఆకట్టుకున్న సంగతి విదితమే.

crazy crime thriller into ott

క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కినట్లు ట్రైలర్లలో కనిపించింది. ఈ సిరీస్‌లో డ్యుయెల్ రోల్ లో కనిపించారు మనోజ్ బాజ్ పేయ్. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 11న అంటే ఈ రోజు నుండే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో వచ్చేసింది. ఈ కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ సీజన్ 1 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రముఖ దర్శకురాలు, నటి..కొంకణా సేన్ స్వాతి శెట్టి అనే పాత్రలో కనిపించబోతుంది. మరీ ఇంకెందుకు ఆలస్యం ఓటీటీలోకి వచ్చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వాచ్ చేసి.. ఎలా ఫీలయ్యారో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet