అనుకున్న దానికంటే ముందే OTTలోకి జపాన్‌!

‘జపాన్‌’ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. హీరో కార్తీ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక, ఈ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

‘జపాన్‌’ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. హీరో కార్తీ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక, ఈ సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తమిళ స్టార్‌ హీరో కార్తీ హీరోగా నటించిన ‘జపాన్‌’ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రాజు మురుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్యాన్యుయేల్‌ నటించారు. సునీల్‌, విజయ్‌ మిల్టన్‌, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జపాన్‌’ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద వెనకడుగు వేసింది. విమర్శకులనుంచే కాదు.. ప్రేక్షకుల నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.

మొదటి రోజు కలెక్షన్ల పరంగా పర్లేదు అనిపించినా.. మౌత్‌ పబ్లిసిటీ ద్వారా కలెక్షన్లను గండిపడింది. రోజు రోజుకు సినిమా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. జపాన్‌ విడుదలైన రోజే.. జిగిర్తాండ డబుల్‌ ఎక్స్‌ సినిమా కూడా రిలీజ్‌ అవ్వటం జపాన్‌ కలెక్షన్లకు గండి కొట్టింది. జపాన్‌ మొదటి రోజు వసూళ్లు కేవలం 10 కోట్లకే పరిమితం అయ్యాయి. ఇక, సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఇప్పటికే ఫిక్స్‌ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ చాలా రోజుల క్రితమే జపాన్‌ స్ట్రీమింగ్‌ హక్కుల్ని సొంతం చేసుకుంది.

సదరు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో సినిమా స్ట్రీమింగ్‌ వచ్చే నెల రెండవ వారంనుంచి  జరగాల్సి ఉంది. అయితే, సినిమాకు థియేటర్లలో వస్తున్న స్పందన కారణంగా స్ట్రీమింగ్‌ తేదీని ప్రీ పోన్‌ చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్‌ మొదటి వారంలోనో లేదా అంతకంటే ముందే జపాన్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లలో అంతగా రాణించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం రాణిస్తుందన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్‌. కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడకపోయినా.. ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. ఈ చిత్రం కూడా ఆ బాటలోనే నడస్తుందని ఫ్యాన్స్‌ ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, కార్తీకి జపాన్‌ 25వ సినిమా. ఆ కారణంతోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంతో సమానంగా ఆయన తెలుగులోనూ జపాన్‌ ప్రమోషన్‌ చేశారు. 25వ సినిమా గుర్తిండిపోయేలా ఉండాలని.. ఏకంగా కోటిన్నర రూపాయలు సేవా కార్యక్రమాల కోసం డొనేట్‌ చేశారు.  తమిళనాడులో తన మిత్రులను పిలిచి ఓ ఈవెంట్‌ చేశారు. ఈ ఈవెంట్‌లో విశాల్‌, ఆర్య, తమన్నా, జయం రవి, సూర్య, తదితరులు పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మరి, జపాన్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments