iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లో ప్రభుదేవా తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published May 13, 2025 | 1:46 PM Updated Updated May 13, 2025 | 1:46 PM

ఎప్పటికప్పుడు OTT లో ఫ్రెష్ సినిమాలు , సిరీస్ లు వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉంటె మరికొన్ని డబ్బింగ్ సినిమాలు,సిరీస్ లు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రభుదేవా మూవీ ఒకటి నేరుగా OTT లో రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 13, 2025 | 1:46 PMUpdated May 13, 2025 | 1:46 PM
డైరెక్ట్ గా OTT లో ప్రభుదేవా తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఎంత థియేటర్ లో కొత్త సినిమాలు చూసినా కానీ ఎప్పుడెప్పుడు OTT లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ డైరెక్ట్ గా OTT లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే ప్రభుదేవా నటించిన ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ జాలీ ఓ జింఖానా. గత ఏడాది తమిళ్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ నేరుగా OTT లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా మే 15 నుంచి ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ కానుంది.

తమిళంలో ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఇప్పుడు ఈ మూవీ తెలుగు వెర్షన్ లో OTT లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా ఆ ప్రాంతం MLA తో వీళ్లకు గొడవలు వస్తాయి. దానికోసం వీరంతా ఓ లాయర్ ను సంప్రదిస్తారు. కానీ అతనిని కలవడం కోసం వెళ్ళినప్పుడు అతను శవమై కనిపిస్తాడు. అసలు ఆ లాయర్ ఎలా చనిపోయాడు ? అతనికి ఆ MLA కి సంబంధం ఏంటి ? చివరికి వీరి సమస్య తీరిందా లేదా ? అసలు ఏమి జరిగింది ? ఇందులో ప్రభుదేవా క్యారెక్టర్ ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఆహా లో ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.