Venkateswarlu
Curry And Cyanide Review In Telugu: దేశ వ్యాప్తంగా కేరళ జాలీ జోసఫ్ కేసు సంచలనం సృష్టించింది. ఆమె ఆరు హత్యలు చేసిన విధానం అందర్నీ భయ భ్రాంతులకు గురి చేసింది.
Curry And Cyanide Review In Telugu: దేశ వ్యాప్తంగా కేరళ జాలీ జోసఫ్ కేసు సంచలనం సృష్టించింది. ఆమె ఆరు హత్యలు చేసిన విధానం అందర్నీ భయ భ్రాంతులకు గురి చేసింది.
Venkateswarlu
మీడియాను క్రమం తప్పకుండా ఫాలో అయ్యేవారికి.. ముఖ్యంగా క్రైమ్ న్యూస్ ఫాలో అయ్యేవారికి కేరళ ‘జాలీ జోసఫ్’ కేసు గుర్తుండే ఉంటుంది. 2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కుటుంబ ఆస్తుల కోసం జాలీ జోసఫ్ అనే మహిళ ఏకంగా 6 హత్యలు చేసింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఈ హత్యలు చేసింది. తినే తిండిలో సైనేడ్ కలుపుతూ దారుణాలకు పాల్పడింది. చివరకు పాపం పండి జైలు పాలైంది.
తాజాగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ జాలీ జోసఫ్ కేసుపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించింది. ‘ కర్రీ అండ్ సైనేడ్: ది జాలీ జోసఫ్ కేస్’ పేరిట ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కూడతాయ్ సీరియల్ కిల్లింగ్స్ ఆధారంగా ఈ డాక్యుమెంటరీని చిత్రకరించారు. దేశంలో సంచలనం సృష్టించిన ‘ జాలీ జోసఫ్’ కేసు డాక్యుమెంటరీగా ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఇంతకీ డాక్యుమెంటరీ ఎలా ఉంది?
కేరళ, కోజికోడ్‌లోని కూడతైకి చెందిన జాలీ జోసఫ్‌కు 1997లో అదే ప్రాంతానికి చెందిన రాయ్ థామస్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె అత్తింట్లో అడుగుపెట్టింది. మామ టామ్ థామస్, అత్త అన్నమ్మ థామస్‌లు ఇద్దరూ టీచర్లుగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. మిగిలిన కుటుంబసభ్యులు కూడా ఉద్యోగాలు చేస్తున్న వారే. ఈ నేపథ్యంలో జూలీని కూడా ఉద్యోగం చేయమని అన్నమ్మ థామస్ పట్టుబట్టింది. అత్త పోరు పడలేక జూలీ ఎన్‌ఐటీ కోయికోడ్‌లో పని చేస్తున్నట్లు నమ్మబలికింది. ప్రతీ రోజూ కారులో ఉద్యోగానికి వెళ్లి వస్తున్నట్లు నటించేది.
జూలీకి భర్త రాయ్ కుటుంబ ఆస్తిపై కన్నుఉండేది. ఎలాగైనా ఆస్తిని తన సొంతం చేసుకోవాలని అనుకుంది. ఇందుకోసం సైనేడ్ హత్యలకు పథకం రచించింది. 2002లో మంచి నీళ్లలో సైనేడ్ కలిపి అన్నమ్మను హత్య చేసింది. 2008లో టామ్ థామస్‌ను తినే ఆహారంలో సైనేడ్ పెట్టి చంపేసింది. 2010లో భర్త రాయ్ థామస్‌ను… ఆ తర్వాత అన్నమ్మ థామస్ సోదరుడు మ్యాథ్యూను.. 2016లో జూలీ రెండో భర్త అయిన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర సంవత్సరాల బిడ్డను కూడా చంపేసింది. ఆ తర్వాతే షాజు, జూలీల పెళ్లి జరిగింది. రాయ్ థామస్ తమ్ముడు రోజు థామస్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2019లో జూలీని అరెస్ట్ చేశారు.
జాలీ జోషఫ్ డబ్బున్న కుటుంబంలో పుట్టినా.. ఆమె బుద్ధి మొత్తం నేర ప్రవృత్తితో నిండిపోయి ఉండేది. ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ఆడుతూ ఉండేది. ఫస్ట్ ఇయర్‌లోనే కాలేజీ మానేసింది. పెళ్లి తర్వాత అత్తింటి వారికి, ఊర్లో వారికి తాను ఎమ్ కామ్ పూర్తి చేశానని చెప్పింది. అంతేకాదు! ఎన్‌ఐటీ కాలికట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నానని నమ్మించింది. ప్రతీ రోజు కాలేజీకి వెళుతున్న వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చేది. ఎక్కువగా కాలేజీ క్యాంటీన్ కూర్చునేది. సాయంత్రం అయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేది. ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఇక, ఆరు హత్యల్లో ఈమెకు దగ్గరి బంధువైన మ్యాథ్యూ సహాయం చేశాడు. బంగారు షాపులో పని చేసే ఇతడు జాలీకి సైనెడ్ అందించాడు. ఇతడికి మరో వ్యక్తి ప్రాజి కుమార్ సహాయం చేశాడు. ఇద్దరూ కూడా జైలు పాలయ్యారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్టినో టామీ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. కేసుకు సంబంధించి అన్ని వివరాలను బయటకు తీసుకురావటంలో లీగల్ చిక్కులు ఉండటంతో లీగల్ చిక్కులు లేని వివరాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డాక్యుమెంటరీ మొత్తం జాలీ జోసఫ్ కుటుంబం వైపు నుంచే నడుస్తుంది. కేసును ఇన్‌వెస్టిగేట్ చేసిన అధికారి కేటీ సిమోన్‌తో పాటు.. స్టోరీ మొత్తాన్ని జాలీ పెద్ద కుమారుడు రెమో, మరదలు రెంజీ విల్సన్, మరిది రోజో థామస్‌లు ప్రేక్షకులకు వివరించారు.
తెరపై జాలీ కుమారుడు రెమోకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది. డాక్యుమెంటరీ మొత్తం ఆ హత్యలు ఎలా జరగాయన్నదానిమీదే నడిచింది. దాదాపు 1.30 ఉన్న ఈ డాక్యుమెంటరీలో.. 20 ఏళ్ల కాలంలో జరిగిన నేరాలను విపులంగా వివరించి చెప్పే ప్రయత్నం చేయలేదు. సాధారణంగా హత్యలు జరిగినపుడు.. వాటిని డాక్యుమెంటరీగా చిత్రీకరిస్తున్నపుడు.. హత్యలు చేసిన వ్యక్తి గురించి, అతడి మానసిక పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం జరుగుతుంది. కానీ, ఇందులో జాలీ గురించిన మానసిక పరిస్థితి గురించి ఎంత మాత్రమూ వివరించలేదు.
తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా కనిపించడం లేదు. ధనిక కుటుంబంలో పుట్టి.. ఆస్తి కోసం ఎందుకు హత్య చేసిందన్న కోణాన్ని బలంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. జాలీ జైలుకు వెళ్లిన తర్వాత కుటుంబం ఎలా ఉందన్న దాని గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. మరి, ‘ కర్రీ అండ్ సైనేడ్: ది జాలీ జోసఫ్ కేస్’ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.