iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన హాలీవుడ్‌ హారర్‌ మూవీ! భయం లేకుండా చూస్తే గ్రేట్!

  • Published Feb 07, 2024 | 11:02 AMUpdated Feb 07, 2024 | 11:17 AM

The Exorcist Believer Movie: హారర్‌ సినిమాలు ఇష్టపడే వారికి గుడ్‌ న్యూస్‌. మిమ్మల్ని భయపెట్టడానికి లేటెస్ట్‌గా విడుదలైన సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ హారర్‌ మూవీ ఒకటి ఓటీటీలోకి రానుంది. ఆవివరాలు..

The Exorcist Believer Movie: హారర్‌ సినిమాలు ఇష్టపడే వారికి గుడ్‌ న్యూస్‌. మిమ్మల్ని భయపెట్టడానికి లేటెస్ట్‌గా విడుదలైన సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ హారర్‌ మూవీ ఒకటి ఓటీటీలోకి రానుంది. ఆవివరాలు..

  • Published Feb 07, 2024 | 11:02 AMUpdated Feb 07, 2024 | 11:17 AM
OTTలోకి వచ్చేసిన హాలీవుడ్‌ హారర్‌ మూవీ! భయం లేకుండా చూస్తే గ్రేట్!

ప్రేక్షకులకు ఎన్నటికి బోర్‌ కొట్టని జానర్‌ అంటే.. హారర్‌ సినిమాలు అని చెప్పవచ్చు. చాలా మందికి హారర్‌ మూవీలు చూడాలంటే భయం.. అయినా సరే.. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని.. మరి ఈ తరహా సినిమాలు చూస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టిన సినిమాలేవి రాలేదు అని చెప్పవచ్చు. తెలుగులో అయితే మసూద మూవీ తర్వాత.. ఆ రేంజ్‌ హరర్‌ సినిమా ఏది రాలేదు అంటున్నారు ఆడియన్స్‌. దాంతో చాలా రోజులుగా ప్రేక్షకులు మాంచి భయపెట్టే హారర్‌ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అదుగో అలాంటి వారి కోసమే ఈ వార్త. హారర్‌ జానర్‌ ఇష్టపడే వారికి.. ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పవచ్చు. లేటేస్ట్‌ సూపర్ హిట్ హాలీవుడ్ హారర్ మూవీ ఒకటి ఓటీటీలోకి రానుంది. ఆ వివరాలు..

హారర్‌ సినిమా కోసం ఎదురు చూస్తోన్న ప్రేక్షకలకు ఓ గుడ్‌ న్యూస్‌. సూపర్ హిట్ హాలీవుడ్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో చిత్రం ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైకి రావడం విశేషం. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే ఫిబ్రవరిలోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది అంటున్నారు.

the exoricist movie in ott

ది ఎగ్జార్సిస్ట్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఆరో సినిమా ది ఎగ్జార్సిస్ట్‌: బిలీవర్‌. ఈ సీరిస్‌ నుంచి మొదటిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్‌తో తొలి సినిమా వచ్చింది. ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టి.. మంచి హారర్‌ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటి వరకు ఆరు సినిమాలు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ పేరుతో ఆరో సీక్వెల్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకుముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీకి కాస్త నెగటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి విజయం దక్కించుకుంది.

30 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ది ఎగ్జార్సిస్ట్: బిలీవర్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర 130 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. గతేడాది అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత అనగా 2024, ఫిబ్రవరిలో జియో సినిమాలో ఇండియన్ ఆడియెన్స్ ఈ హారర్ మూవీని చూసే అవకాశం దక్కింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇక ఈ వీకెండ్‌ హారర్‌ మూవీ చూసి భయపడుతూ ఎంజాయ్‌ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి