iDreamPost
android-app
ios-app

Hansika: తెలుగు OTTలోకి వచ్చేసిన హన్సిక హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ వివరాలివే

  • Published May 03, 2024 | 9:26 AM Updated Updated May 03, 2024 | 9:26 AM

యాపిల్‌ బ్యూటీ హన్సిక నటించిన హారర్‌ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకు ఆ సినిమా ఏది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వనుంది అంటే..

యాపిల్‌ బ్యూటీ హన్సిక నటించిన హారర్‌ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది. ఇంతకు ఆ సినిమా ఏది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వనుంది అంటే..

  • Published May 03, 2024 | 9:26 AMUpdated May 03, 2024 | 9:26 AM
Hansika: తెలుగు OTTలోకి వచ్చేసిన హన్సిక హారర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ వివరాలివే

ఓటీటీలకు క్రేజ్‌ పెరిగిన తర్వాత.. బోలేడంత కొత్త కంటెంట్‌ ప్రేక్షకులను పలకరిస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా.. సెలబ్రిటీలంతా ఓటీటీల బాట పట్టారు. మంచి కథ ఉంటే చాలు యాక్ట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎంత పెద్ద, భారీ బడ్జెట్‌ సినిమా అయినా సరే.. విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఇక కొన్ని సినిమాలైతే నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక చాలా మంది ప్రేక్షకులకు సస్పెన్స్‌ థ్రిల్లర్‌, హారర్‌ మూవీలు అంటే చాలా ఇష్టం. ఈ జానర్‌కు సంబంధించిన సినిమాలు అంటే.. ఉన్న ఆసక్తి, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్లు, మేకర్స్‌ కూడా ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా యాపిల్‌ బ్యూటీ హన్సిక నటించిన హారర్‌ సినిమా ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. తెలుగులోను వచ్చేస్తుంది. ఆ వివరాలు..

హన్సిక ప్రధాన పాత్రలో నటించి తమిళ హారర్‌ చిత్రం గార్డియన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. శుక్రవారం నాడు సింప్లీసౌత్‌ ఓటీటీలో విడుదలయ్యింది. అయితే ఇక్కడో చిక్కు వచ్చి పడింది. సింప్లీసౌత్‌లో కేవలం ఓవర్‌సీస్‌ ఆడియెన్స్‌ మాత్రమే ఈ మూవీని చూడగలరు. ఇక మన ప్రేక్షకులు గార్డియన్‌ సినిమా చూడాలంటే.. మరో వారం రోజులు వెయిట్‌ చేయక తప్పదని తెలుస్తోంది. మే 10 నుంచి హన్సిక గార్డియన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

గార్డియన్‌ సినిమా విషయానికి వస్తే.. శబరి గురు శరవణన్‌ ఈ సినిమాకు డైరెక్టర్‌. ఈ ఏడాది మార్చి 8న గార్డియన్‌ థియేటర్లలో విడుదలైంది. అయితే అనుకున్న మేర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన నాలుగైదు రోజులకే మాయం అయ్యింది. రొటీన్‌ రివేంజ్‌ డ్రామాతో సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా ఆదరించలేదు. ఇక సినిమాలో ఆకట్టుకున్న అంశం ఏదైనా అంటే.. హన్సిక యాక్టింగే అంటున్నారు. కామెడీ బాగాలేదంటూ విమ‌ర్శ‌లొచ్చాయి.

2022లోనే ఈ సినిమా మొద‌లైంది. షూటింగ్ ఆలస్యం కావ‌డం, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైంది. షూటింగ్ పూర్త‌యిన రెండేళ్ల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. ఈ సినిమాలో హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రల్లో నటించారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss