Swetha
విశ్వక్ సేన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా పేరొందిన సినిమా "గామి". అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ డేట్ ను అధికారికంగా ప్రకటించింది డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్.
విశ్వక్ సేన్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ గా పేరొందిన సినిమా "గామి". అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ డేట్ ను అధికారికంగా ప్రకటించింది డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్.
Swetha
విశ్వక్ సేన్ కు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గామి సినిమాకు.. విధ్యాదర్ కాగిత దర్శకుడిగా వ్యవహరించాడు. “గామి” సినిమాతోనే ఈ దర్శకుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు ఈ దర్శకుడు. క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ సినిమా షూటింగ్ దాదాపు.. ఆరేళ్ళ పాటు ఈ సినిమాను చిత్రీకరించారు. ఆరేళ్ళ కష్టానికి ఫలితంగా గామి సినిమా యునానిమస్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 దక్కించుకుందన్న సంగతి తెలిసిందే. అయితే, థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 5 నుంచి గామి సినిమా స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. అది పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు గామి సినిమా స్ట్రీమింగ్ పార్టనర్ అధికారికంగా ఓటీటీ ఎంట్రీ డేట్ ను అనౌన్స్ చేసింది.
గామి సినిమా భారీ అంచనాల మధ్యన మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. అందరి అంచనాలను నిలబెట్టుకుని.. బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ , చాందిని చౌదరి ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించింది. అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకే జీ 5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది. అయితే ముందుగా గామి సినిమాను ఏప్రిల్ 5నుంచి స్ట్రీమింగ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ, ఆరోజున ఓటీటీ లో స్ట్రీమింగ్ కాకపోవడంతో .. ప్రేక్షకులకు నిరాశ ఎదురయ్యింది. దీనితో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ పై రకరకాల చర్చలు జరిగాయి, ఇక ఇప్పుడు ఎట్టకేలకు జీ 5 ప్లాట్ ఫార్మ్ అధికారికంగా .. “మీ సీట్‌బెల్ట్స్ వేసుకొని రెడీగా ఉండండి. గామి ప్రపంచంలోకి ప్రయాణాన్ని జీ5 ద్వారా కొనసాగించండి” అనే క్యాప్షన్ తో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
గతంలో .. హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడడంతో.. ప్రేక్షకులు ఈసారి జీ 5 సంస్థ గురించి భారీగానే అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎట్టకేలకు సినిమా ఎంట్రీ డేట్ ను అధికారికంగా ప్రకటించడంతో .. కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఈసారైనా చెప్పిన టైమ్ ప్రకారం సినిమా స్ట్రీమింగ్ అయితే చాలని .. మరికొంతమంది భావిస్తున్నారు. ఇక గామి సినిమా కథ విషయానికొస్తే.. మూడు కథలను బేస్ చేసుకుంటూ ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో ఒక అఘోరా. ఓ సమస్య కారణంగా అతని ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. దాని నుంచి బయటపడడానికి .. అతను హిమాలయాలకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. మరోవైపు.. అభినయ.. తన కూతురిని దేవదాసి వృత్తిలోకి తీసుకురావాలని అనుకుంటుంది. కానీ తన కూతురికి ఆ వృత్తి నచ్చదు. ఇక మరోవైపు ఇండియా, చైనా బోర్డర్‌లోని ఓ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌లో ఓ యువకుడు బందీగా ఉంటాడు. దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు ఈ మూడు కథలకు సంబంధం ఏమిటి! చాందిని చౌదరి పాత్ర ఎలా ఉంటుంది! విశ్వక్ సేన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అనేవి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి గామి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.