iDreamPost
android-app
ios-app

Gaami OTT: ఆ OTTలోకి గామి ఫిక్స్! కానీ.., ధియేటర్ లో మిస్ కాకండి!

  • Published Mar 08, 2024 | 2:16 PM Updated Updated Mar 08, 2024 | 3:37 PM

Gaami OTT Release Date: విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మార్చి 8న థియేటర్ లో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యి ఒక్క రోజు కూడా కాకుండానే అప్పుడే "గామి" సినిమా ఓటీటి ఎంట్రీపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Gaami OTT Release Date: విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మార్చి 8న థియేటర్ లో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే, ఈ సినిమా విడుదలయ్యి ఒక్క రోజు కూడా కాకుండానే అప్పుడే "గామి" సినిమా ఓటీటి ఎంట్రీపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 08, 2024 | 2:16 PMUpdated Mar 08, 2024 | 3:37 PM
Gaami OTT: ఆ OTTలోకి గామి ఫిక్స్! కానీ.., ధియేటర్ లో మిస్ కాకండి!

ఓటీటీ సినిమాలకు ఈ మధ్య ఎక్కువ ఆదరణ లభిస్తుంది. దీనితో థియేటర్ లో విడుదల అయ్యే సినిమాల కోసం ఎలా ఎదురుచూస్తున్నారో.. ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల కోసం కూడా అదే రేంజ్ లో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్ లో సినిమాలు విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు నెల రోజుల లోపే .. బడా హీరోల చిత్రాలు సైతం ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం “గామి”. ఈ సినిమా మహా శివరాత్రి సందర్బంగా మార్చి8న థియేటర్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా గురించి అంతటా .. పాజిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో .. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో లేటెస్ట్ ఫిల్మ్ “గామి”. ఈ సినిమాతో తెలుగులోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు విద్యాధర్ కాగిత. ఈ సినిమా మార్చి 8న తెలుగు స్టేట్స్ లో విడుదల అవ్వడానికంటే ముందే.. అమెరికా, యూకే వంటి దేశాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. దీనితో గామి సినిమాపై ఫుల్ పాజిటివ్ టాక్ నడిచింది. ఈ సినిమాలో విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయనే రివ్యూను కూడా ఇచ్చారు నెటిజన్లు. అలాగే ఈ సినిమాలో బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇంకా సినిమా థియేటర్ లో విడుదల అయ్యి ఒక్క రోజు కూడా కాకముందే .. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీపై డిస్కషన్స్ నడుస్తున్నాయి. గామి ఓటీటీ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు భారీగానే పోటీ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో గామి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ సంస్థ జీ5 కొనుగోలు చేసిందట. అలాగే, గామి సినిమా ఓటీటీలోకి నెల రోజుల తర్వాతనే ఎంట్రీ ఇచ్చేలా డీల్ కూడా కుదుర్చుకుందట. దీనిని బట్టి ఏప్రిల్ రెండవ వారంలో “గామి” సినిమా జీ5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, సినిమా ఎంత ఓటీటీ అడుగుపెట్టినా కూడా .. విజువల్స్ వండర్స్ కోసం థియేటర్ లో ఈ సినిమాను ఖచ్చితంగా ఎక్స్పీరియెన్స్ చేయాల్సిందే.

అయితే, ఇప్పటికే జీ5 కొనుగోలు చేసిన హనుమాన్ మూవీ ఓటీటీ ఎంట్రీ వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు గామి సినిమా గురించి కూడా ఇటువంటి టాక్ ఏ నడుస్తుంది. అనుకున్న టైం కి విడుదల చేస్తారా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, ప్రతి సినిమాకు అలానే జరిగే అవకాశం కూడా లేదు, కాబట్టి “గామి” సినిమా ఓటీటీ ఎంట్రీపై మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే టాక్ షోతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు గామి సినిమా విడుదలైంది. ఆ తర్వాత విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి, “గామి” సినిమా ఓటీటీ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingjojobetjojobet girişjojobet girişjojobet girişcasibom