iDreamPost
android-app
ios-app

చాలామంది లైట్ తీసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఒక్కసారి చూడండి..!

  • Published Feb 08, 2024 | 5:57 PM Updated Updated Feb 08, 2024 | 5:57 PM

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు వస్తున్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఓటీటీ లోకి వస్తున్న ప్రతి వెబ్ సిరీస్ సూపర్ హిట్ సాదించేస్తుంది. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్ లను మిస్ చేస్తూ ఉంటారు ఆడియన్సు. ఎవరైనా కనుక ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను మిస్ చేస్తే కనుక.. వెంటనే చూడాల్సిందే మరి.

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు వస్తున్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. ఓటీటీ లోకి వస్తున్న ప్రతి వెబ్ సిరీస్ సూపర్ హిట్ సాదించేస్తుంది. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్ లను మిస్ చేస్తూ ఉంటారు ఆడియన్సు. ఎవరైనా కనుక ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ ను మిస్ చేస్తే కనుక.. వెంటనే చూడాల్సిందే మరి.

  • Published Feb 08, 2024 | 5:57 PMUpdated Feb 08, 2024 | 5:57 PM
చాలామంది లైట్ తీసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఒక్కసారి చూడండి..!

ప్రస్తుతం ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా.. వచ్చిన ప్రతి వెబ్ సిరీస్ ను ఆదరిస్తున్నారు. ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ , కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లెర్స్ , క్రైమ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కంటెంట్ తో .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సిరీస్ లు విడుదల అవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చాలా మంది ఆడియన్స్ సస్పెన్స్ థ్రిల్లెర్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా ఇంత క్రేజ్ ను సంపాదించుకుంటున్న వెబ్ సిరీస్ ల వైపు.. వెండి తెర నటీ నటులు సైతం మొగ్గు చూపుతున్నారు. దీనితో సినిమాలలో కనిపించిన నటి నటులు తిరిగి బుల్లితెరపై అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే టెలివిజన్ లో సీరియల్ అయినా చిన్నారి పెళ్లికూతురు తో అందరిని అలరించిన .. హీరోయిన్ అవికా గోర్ నటించిన వెబ్ సిరీస్ “వధువు” .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. సాధారణంగా ఈ బిజీ లైఫ్ లో ఉండి లేదా టైటిల్ చూసి ఇలా అనేక కారణాల వలన ఈ సిరీస్ ను మిస్ అయితే మాత్రం.. వారంతా ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. అసలు ఈ సిరీస్ ఎందుకు చూడాలి! ఈ సిరీస్ కథ ఎలా ఉంటుంది! అనే వివరాలు తెలుసుకుందాం.

బుల్లి తెర ప్రేక్షకులందరికి .. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ అంటే ఎంత ప్రత్యేకమో.. ఆ సీరియల్ లో చిన్నప్పటి ఆనంది క్యారక్టర్ లో నటించిన అవికా గోర్ కూడా .. అంతే ప్రత్యేకం. ఆ సీరియల్ తర్వాత వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో అలరించింది అవికా. ఇక ఆ తర్వాత చిన్నారి పెళ్లికూతురు లుక్ లోనే .. “వధువు” అనే వెబ్ సిరీస్ లో నటించింది. గత ఏడాది నుంచి ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సరికొత్త కథాంశంతో .. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే..

అంజూరి ఇందు(అవికా గోర్) ఒక తెలివైన అమ్మాయి. చదువులో టాపర్ , అలాగే తల్లి తండ్రులు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుంది. ఈ క్రమంలో తనకు కాబోయే భర్తను సొంత చెల్లెలు తీసుకువెళ్లిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోతోంది. ఇక రెండవ సారి ఆనంద్ (నందు) తో పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లి పత్రికతో చెల్లి వస్తుంది. మరో వైపు ఈ పెళ్లిని కూడా ఆపాలని ఎవరో ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ఆటంకాల మధ్యన పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత అత్తగారింట్లో అడుగు పెట్టిన ఇందుకు ఎన్నో సందేహాలు కలుగుతాయి. ఈ క్రమంలో ఆమె అనుకుని ఆమె ఆడపడుచు మీద దాడి జరుగుతుంది. ఆ హత్య ప్రయత్నం చేసింది ఎవరు? ఆనంద్ తమ్ముడు (అలీ రెజా) పెళ్లి చెడిపోవడానికి కారణం ఏమిటి? అతడి భార్య ఎక్కడుంది ? అతడి పెళ్లి విషయాన్ని, ఆనంద్ & ఆర్యల పెద్దమ్మ కుమార్తెకు మతిస్థిమితం లేని విషయాన్ని.. ఇందు దగ్గర ఎందుకు దాచారు? పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవకు, అనుమాస్పద ఘటనలకు కారణం ఎవరు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

చూడడానికి ఒక రొటీన్ ఫార్మషన్ లా అనిపించినా కూడా .. కంటికి కనిపించని శత్రువు ఎవరు? అనేది తెలుసుకోవాలని.. ఆడియన్సులో ఓ ఆలోచన, ఆసక్తి, క్యూరియాసిటీని కలిగిస్తుంది ఈ వెబ్ సిరీస్. ఓ విధంగా చెప్పాలంటే దర్శకుడు, నటీనటులు ఈ విషయంలో ‘వధువు’ మేకర్స్ వంద శాతం న్యాయం చేశారు. ఇక ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్స్ గా .. ఒక్కో ఎపిసోడ్ 20 నిమిషాల నిడివితో కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సిరీస్ ను మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే మాత్రం.. వెంటనే “వధువు” ను డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో చూసేయండి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomCasibom girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Giriş