iDreamPost
android-app
ios-app

OTTలోకి సూపర్ థ్రిల్లర్ మూవీ.. వారం రోజులకే స్ట్రీమింగ్!

  • Published Apr 04, 2024 | 1:10 PM Updated Updated Apr 04, 2024 | 1:10 PM

మలయాళ సినిమాలు ప్రేక్షకులను తెగ మెప్పించేస్తున్నాయి, ఈ క్రమంలో మంజుమ్మేల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

మలయాళ సినిమాలు ప్రేక్షకులను తెగ మెప్పించేస్తున్నాయి, ఈ క్రమంలో మంజుమ్మేల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

  • Published Apr 04, 2024 | 1:10 PMUpdated Apr 04, 2024 | 1:10 PM
OTTలోకి సూపర్ థ్రిల్లర్ మూవీ.. వారం రోజులకే స్ట్రీమింగ్!

ఓటీటీలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ, ఇప్పుడు అందరు ఎదురుచూసేది మాత్రం మలయాళీ సినిమాల కోసమే ఎందుకంటే మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంటున్నాయి. మొన్నీమధ్య వచ్చిన ప్రేమలు సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు .. తెలుగులో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఆ తర్వాత అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మంజుమ్మేల్ బాయ్స్. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రిలీజ్ పై బాగా చర్చలు జరిగాయి. ముందుగా తెలుగు వెర్షన్ ను రిలీజ్ కు అనౌన్స్ చేసిన డేట్ పోస్టుపోన్ అవ్వగా.. ఈ సినిమా తెలుగు రిలీజ్ రకరకాల చర్చలకు దారి తీసింది. ఇక ఎట్టకేలకు ఏప్రిల్ 6న థియేటర్స్ లో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

మలయాళంలో మంజుమ్మేల్ బాయ్స్ సినిమా రూ. 200 కోట్లు వసూళ్లు చేసింది. ఇది ఒక రియల్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై అందరికి ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక మలయాళీ సినిమాలకు తెలుగులో లభిస్తున్న ఆదరణతో ఈ సినిమాను కూడా.. తెలుగు వెర్షన్ ను ఏప్రిల్ 6న రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ ఎంట్రీ డేట్ పై బజ్ నడుస్తోంది. మంజుమ్మేల్ బాయ్స్ ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాకు చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. కాగా,సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ క్రమంలో ఏప్రిల్ 6న తెలుగు వెర్షన్ రిలీజ్ ఉంది కాబట్టి.. థియేటర్ లో రిలీజ్ అయిన పది రోజులకే ..
తెలుగుతో పాటు.. మలయాళంలోను ఓటీటీలోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మంజుమ్మెల్ బాయ్స్ సినిమా విషయానికొస్తే.. 2006 తమిళనాడు కొడైకెనాల్ లోని గుణ గుహల్లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా.. ఈ సినిమాను తెరకెక్కించారు. కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గుణ గుహలను చూడడానికి వెళ్తారు. అందులో ఒకరు ప్రమాదవశాత్తు లోయలో పడిపోతాడు. దీనితో అతని ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసే ప్రయాణమే.. ఈ సినిమా స్టోరీ. గుణ గుహల్లో తప్పిపోయిన స్నేహితుడి కోసం అతని స్నేహితులు చేసిని ప్రయత్నాలు.. అప్పట్లో సంచలనం సృష్టించింది. పోలీసులు సైతం కాపాడలేమని చెప్పినా.. అతడి స్నేహితులు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంటుంది చెప్పడంలో.. ఏ సందేహం లేదు. మరి, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş